Site icon Prime9

Reliance Jio 5G: ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్న రిలయన్స్ జియో

Reliance Jio 5G

Reliance Jio 5G

Reliance Jio 5G: ప్రముఖ నెట్ వర్క్ దిగ్గజం జియో.. ప్రత్యర్థి నెట్ వర్క్ లకు చుక్కలు చూపిస్తోంది. 5జీ నెట్ వర్క్ లో దేశంలో అగ్రస్థానంలో దూసుకెళ్తోంది. డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అందించిన వివరాలు ప్రకారం.. రిలయన్స్ దేశంలోనే అత్యంత వేగవంతమైన 5జీ నెట్ వర్క్ ను రూపొందించడంతో పాటు అల్ట్రా హై స్పీడ్ ఇంటర్నెట్ ను అందించడానికి దాదాపు ఒక లక్ష టెలికాం టవర్స్ నిర్మించింది. ఇది జియో సమీప ప్రత్యర్థి కంటే 5 రెట్టు ఎక్కువ.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ నేషనల్ ఈఎంఎఫ్‌ పోర్టల్‌లో ఉంచిన నివేదిక ప్రకారం.. జియో రెండు ఫ్రీక్వెన్సీలలో (700 MHz, 3,500 MHz) 99,897 బేస్ ట్రాన్స్‌సీవర్ స్టేషన్‌లను (బీటీఎస్) ఇన్‌స్టాల్ చేసింది. మరోవైపు ఎయిర్‌టెల్‌కు 22,219 బీటీఎస్ లు ఉన్నాయి. ప్రతి బేస్ స్టేషన్‌కు జియోకు 3 సెల్ సైట్‌లు ఉండగా ఎయిర్‌టెల్‌కు 2 మాత్రమే ఉన్నట్లు పీటీఐ వార్తా సంస్థ ఇటీవల పేర్కొంది.

ఇంటర్నెట్‌ స్పీడ్‌కు, సెల్ సైట్‌లు, టవర్‌లకు పరస్పర సంబంధం ఉంటుంది. జియో ఉత్తమ ఇంటర్నెట్‌ సగటు వేగం సెకనుకు 506 మెగాబైట్లు కాగా ఎయిర్‌టెల్‌ యావరేజ్‌ ఇంటర్నెట్‌ స్పీడ్‌ 268 Mbps అని ఇంటెలిజెన్స్, కనెక్టివిటీ ఇన్‌సైట్ గ్లోబల్ లీడర్ అయిన ఊక్లా గత ఫిబ్రవరి నెలలో నివేదించింది.

 

జియో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ వివరాలు(Reliance Jio 5G)

క్రికెట్ అభిమానుల కోసం రిలయన్స్ 3 జియో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్స్ లో రోజు వచ్చే 3 జీబీతోపాటు అదనంగా 2 జీబీ నుంచి 40 జీబీ వరకు డేటాను ఉచితంగా వస్తుంది.

రూ. 999 తో రీఛార్జ్‌ చేసుకున్న యూజర్లకు రోజువారీ 3 జీబీ డేటా, అపరిమిత కాలింగ్‌ సదుపాయంతో పాటు రూ. 241 విలువైన ఓచర్‌ను అందిస్తున్నారు. ఈ ఓచర్‌తో యూజర్లకు 40 జీబీ డేటా అదనంగా లభిస్తుంది. 84 రోజుల పాటు ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ ఉంటుంది.

ఇక, రూ. 399తో రీఛార్జ్‌ చేస్తే 28 రోజులు వ్యాలిడిటీతో రోజువారీ 3జీబీ డేటా, అపరిమిత కాలింగ్‌తో పాటు రూ. 61 విలువైన ఓచర్ లభిస్తుంది. దీంతో 6జీబీ డేటాను యూజర్లు పొందొచ్చు.

రూ. 219 రీఛార్జ్‌తో రోజువారీ 3 జీబీ డేటా, అపరిమిత కాలింగ్‌ పాటు అదనంగా 2 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 14 రోజులు.

ఈ ప్లాన్‌తో పాటు క్రికెట్‌ డేటా యాడ్‌ ఆన్‌ ప్లాన్స్ కూడా జియో ప్రకటించింది. సాధారణ రీఛార్జ్‌కు అదనంగా రూ. 222 తో రీఛార్జ్‌ చేసుకుంటే 50 జీబీ డేటా పొందొచ్చు. సాధారణ రీఛార్జ్‌ వ్యాలిడిటీ ఉన్నన్ని రోజులు ఈ డేటా యూజర్‌కు అందుబాటులో ఉంటుంది. రూ. 444 తో రీఛార్జ్ చేస్తే 60 రోజుల వ్యాలిడిటీతో 100 జీబీ డేటా లభిస్తుంది. రూ. 667తో రీఛార్జ్ చేసుకున్న వారు 150 జీబీ డేటా పొందుతారు. దీని వ్యాలిడిటీ 90 రోజులు.

Exit mobile version