Redmi Pad: రెడ్ మీ సంస్థ వారు విడుదల చేసిన కొత్త ప్యాడ్ వివరాలు ఇవే !

Redmi Pad: రెడ్ మీ సంస్థ వారు విడుదల చేసిన కొత్త ప్యాడ్ వివరాలు ఇవే !

  • Written By:
  • Publish Date - October 3, 2022 / 03:37 PM IST

Redmi Pad: అక్టోబర్ 4వ తేదీన రెడ్‌మీ ప్యాడ్ ఇండియాలో అడుగుపెట్టనుంది. మీడియాటెక్ హీలియో ప్రాసెసర్‌,2k display తో ఈ ట్యాబ్ మన ముందుకు రానుంది.ఇప్పటికే ఈ ట్యాబ్‌కు సంబంధించిన చాలా స్పెసిఫికేషన్లు,ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

రెడ్‌మీ ప్యాడ్ లాంచ్ డేట్ :
రెడ్‌మీ ప్యాడ్ ట్యాబ్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేయనున్నారు.ఈ విషయాన్ని రెడ్‌మీ ఇండియా సంస్థ వారు ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించించారు.దీనికి సంభందించిన స్పెసిఫికేషన్లు ఏవి కూడా బయటకు రాలేదు.మాకు తెలిసిన ప్రకారం ఈ ప్యాడ్ స్పెసిఫికేషన్లు వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

రెడ్‌మీ ప్యాడ్ స్పెసిఫికేషన్లు ఈ విధంగా ఉన్నాయి :

10.6 ఇంచుల 2K IPS ఎల్సీడీ display కలిగిన రెడ్‌మీ ప్యాడ్ మన ముందుకు వస్తుందని తెలుస్తోంది.90Hz రిఫ్రెష్ రేట్, 400 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ ఈ ప్యాడ్ లో ఉండొచ్చు.మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్‌ ఈ ప్యాడ్ లో ఉంటుందని సమాచారం.ఆండ్రాయిడ్‌ 12 బేస్డ్ MIUI os పై ఈ రెడ్ మీ ప్యాడ్ రన్ అవుతుంది.గరిష్ఠంగా 6gb ర్యామ్, 128gb ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది.మైక్రో sd కార్డ్ స్లాట్ కూడా ఉండనుంది.ఇక ఈ ప్యాడ్ లో 8000mAh బ్యాటరీ ఉండనుండగా..18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌‌కు సపోర్ట్ చేసే అవకాశం ఉంది.చార్జింగ్ కోసం usb టైప్-సీ పోర్ట్ ఉంటుంది.

రెడ్‌మీ ప్యాడ్ ధర ఈ విధంగా ఉంది.

రెడ్‌మీ ప్యాడ్ ధర రూ.17,999 నుంచి రూ.19,999 వరకు ఉంటుందని తెలిసిన సమాచారం.

ఇదీ చదవండి :Lenovo Tab M10 Plus: లెనోవో వారు విడుదల చేసి కొత్త ట్యాబ్లెట్ స్పెసిఫికేషన్ల వివరాలు ఇవే!