Site icon Prime9

 Redmi A4 5G: సమయం లేదు మిత్రమా.. రూ.8,499కే రెడ్‌మి 5జీ ఫోన్.. బుక్ చేసే ముందు ఈ ఒక్క పాయింట్ తెలుసుకోండి..!

Redmi A4 5G

Redmi A4 5G

Redmi A4 5G: స్మార్ట్‌ఫోన్ మేకర్ షియోమి ఇండియాలో సరికొత్త  Redmi A4 5Gని విడుదల చేసింది. ఈ మొబైల్ నవంబర్ 27న 8,499 రూపాయలతో సేల్‌కి రానుంది.  ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. అయితే తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్ గురించి పెద్ద షాకింగ్ వార్త ఒకటి వైరల్ అవుతోంది. ఈ రెడ్‌మి మొబైల్ 5G సొంత నెట్‌వర్క్‌లకు మాత్రమేసపోర్ట్ ఇస్తుంది. అయితే Airtel భారతదేశంలో 5G నాన్-స్టాండలోన్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది.

ఇప్పుడు మీ మదిలో మెదులుతున్న ఒక సాధారణ ప్రశ్న ఈ రెండింటి మధ్య తేడాలు ఏమిటి..? మీకు సరళమైన భాషలో వివరించడానికి రిలయన్స్ జియో 5G సేవను అందించడానికి కొత్త 5G టవర్, బూస్టర్ టవర్‌లను ఇన్‌స్టాల్ చేసింది. కానీ భారతీ ఎయిర్‌టెల్ ఇప్పటికే తాను ఇన్‌స్టాల్ చేసిన 4జీ టవర్లలో సిగ్నల్స్‌ను 5జీలోకి మార్చే టెక్నాలజీని ఇన్‌స్టాల్ చేసింది.

కాబట్టి కొత్త 5G ఆధారిత టవర్‌లను 5G స్టాండలన్ నెట్‌వర్క్ అని, 5G సిగ్నల్‌లను ఉపయోగించే 4G టవర్‌లను 5G నాన్-స్టాండలన్ నెట్‌వర్క్ అని పిలుస్తారు. కాబట్టి సారాంశం ఏమిటంటే.. ఈ Redmi A4 5G ఎయిర్‌టెల్ 5G నాన్-స్టాండలన్ నెట్‌వర్క్ టెక్నాలజీకి సపోర్ట్ ఇవ్వదు.

Redmi A4 5G Features
ఈ Redmi A4 5G ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.88-అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేను కలిగి ఉన్న సెగ్మెంట్‌లో ఇదే మొదటి ఫోన్ అని కంపెనీ పేర్కొంది. ఫోన్ ప్రీమియం హాలో గ్లాస్ శాండ్‌విచ్ డిజైన్‌తో వస్తుంది. ఫోన్‌లో 50MP మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీల కోసం ఫోన్‌లో 5MP మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

ఇది HyperOS ఆధారంగా Android 14లో నడుస్తుంది. ఫోన్ 2 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లను, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందుతుంది. Redmi A4 5G ఫోన్‌లో Snapdragon 4s Gen 2 ప్రాసెసర్ ఉంది. ఫోన్ టైప్-సి పోర్ట్, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5160mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఫోన్ డస్ట్, వాటర్ నుంచి సురక్షితంగా ఉంచడానికి IP54 రేటింగ్‌తో వస్తుంది. ఫోన్‌లో 3.5 ఎంఎం ఆడియో జాక్ కూడా ఉంది. ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అందుబాటులో ఉంది.

ఈ Redmi A4 5G ఫోన్ ప్రారంభ ధర రూ. 8,500 కంటే తక్కువ. నిజానికి ఈ ఫోన్  4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,499. మరో 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,499. ఈ ఫోన్ మొదటి సేల్ 27 నవంబర్ 2024న మధ్యాహ్నం 12:00 గంటలకు ప్రారంభమవుతుంది. Redmi A4 5G స్మార్ట్‌ఫోన్ స్టార్రీ బ్లాక్, స్పార్కిల్ పర్పుల్ అనే రెండు కలర్ వేరియంట్‌లలో విడుదలైంది. అలానే ఫోన్ బాక్స్‌లో రూ. 1,999 విలువైన 33W ఛార్జర్ ఉచితంగా అందిస్తున్నారు.

Exit mobile version