Realme P3 5G-P3 Ultra 5G: భారతీయ యువ స్మార్ట్‌ఫోన్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘Realme P3 5G-P3 Ultra 5G’ స్మార్ట్‌ఫోన్‌లను వచ్చే వారం దేశంలో విడుదల చేయనున్నట్లు రియల్‌మీ ధృవీకరించింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు గత ఫిబ్రవరిలో దేశంలో ప్రవేశపెట్టిన Realme P3 Pro 5G, Realme P3x 5G స్మార్ట్‌ఫోన్‌లకు అప్‌గ్రేడ్ వేరియంట్లు. అలాగే, ఈ స్మార్ట్‌ఫోన్‌ల చిప్‌సెట్, డిస్‌ప్లే, బ్యాటరీ, ఛార్జింగ్ ఫీచర్‌లు, లభ్యత వివరాలతో సహా పలు కీలక ఫీచర్లు వెల్లడయ్యాయి. కాబట్టి, రియల్‌మి పీ3 5జీ, పీ3 అల్ట్రా 5జీ స్మార్ట్‌ఫోన్‌ల లాంచ్, లభ్యత, ఫీచర్ల గురించి మరిన్ని వివరాలను చూద్దాం.
Realme P3 5G-P3 Ultra 5G Launch Date
ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు భారతదేశంలో మార్చి 19 న విడుదల కానున్నాయి. ఈ ఫోన్‌లు ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ ఇండియా ఈ-స్టోర్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయని కంపెనీ పత్రికా ప్రకటన తెలిపింది. అయితే ధరల గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ముఖ్యంగా, Realme Buds T200 Lite TWS ఇయర్‌ఫోన్‌లను కూడా అదే రోజున ఆవిష్కరించనున్నట్లు కంపెనీ తెలిపింది.
Realme P3 Ultra 5G Features
మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అల్ట్రా చిప్‌సెట్‌తో రియల్‌మీ పి3 అల్ట్రా ప్రపంచంలోనే మొదటి హ్యాండ్‌సెట్ అవుతుందని కంపెనీ ధృవీకరించింది. AnTuTu స్కోర్ 1.45 మిలియన్లకు పైగా సాధించినట్లు చెబుతున్నారు. ఫోన్ 12GB RAM, 256GB UFS 3.1 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ రియల్‌మీ పి3 అల్ట్రాలో GT బూస్ట్ టెక్నాలజీ ఉంటుంది. ఇది వినియోగదారుల గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. BGMI మూడు గంటల వరకు 90fps గేమ్‌ప్లే, 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే 2,500Hz వరకు టచ్ శాంప్లింగ్ రేటుకు సపోర్ట్ ఇస్తుంది. 6,000mAh బ్యాటరీ, 80W AI బైపాస్ ఛార్జింగ్ టెక్నాలజీకి మద్దతు ఇస్తుంది, ఇది గేమింగ్ సమయంలో వేడెక్కడాన్ని నివారిస్తుంది.
Realme P3 5G Features
ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 Gen 4 SoC ప్రాసెసర్‌తో 15 శాతం మెరుగైన CPU పనితీరును అందిస్తుంది. AnTuTu పరీక్షలో 7,50,000 పాయింట్లు సాధించినట్లు కంపెనీ పేర్కొంది. హ్యాండ్‌సెట్ AI మోషన్ కంట్రోల్, AI అల్ట్రా టచ్ కంట్రోల్‌తో సహా GT బూస్ట్ ఫీచర్‌లకు సపోర్ట్ ఇస్తుంది. BGMI కోసం రియల్‌మి పి3 5జీ 90fps గేమ్‌ప్లేకు మద్దతు ఇస్తుందని కంపెనీ ధృవీకరించింది. యాంటెన్నా అర్రే మ్యాట్రిక్స్ 2.0 టెక్నాలజీ సబ్‌వేలు వంటి తక్కువ-సిగ్నల్ ప్రాంతాలలో హ్యాండ్‌సెట్ కనెక్టివిటీని 30 శాతం పెంచుతుందని టెక్ వర్గాల చెబుతున్నాయి.