Site icon Prime9

Realme Smart Phone: రియల్‌మీ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్ వివరాలు ఇవే!

realme-10

realme-10

Realme Smart Phone:  ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ సంస్థ రియల్‌మీ వరుసగా ఫోన్‌లను లాంచ్‌ చేస్తున్న విషయం మన అందరికీ  తెలిసిందే. ముఖ్యంగా బడ్జెట్‌ వేరియంట్‌లో కొత్త ఫీచర్లతో లాంచ్ ఐనా ఫోన్‌ మన ముందుకు వస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా 10 సిరీస్‌ను తీసుకొచ్చేందుకు రియల్ సంస్థ సిద్ధమైంది. ఈ 10 సిరీస్‌లో భాగంగా Realme 10 pro , Realme 10 ప్రో+ పేరుతో ఫోన్‌లను మన ముందుకు తీసుకురానున్నారు. నవంబర్‌ 9వ తేదీన ఈ స్మార్ట్ ఫోన్స్ మార్కెట్‌లోకి ఈ 10 సిరీస్ స్మార్ట్ ఫోన్లను విడుదల చేయనున్నారని తెలుస్తుంది.

Realme 10pro స్పెసిఫికేషన్స్..
Realme 10pro స్మార్ట్‌ ఫోన్‌లో మీడియాటెక్‌ హీలియో G99 ప్రాసెసర్‌ పై ఈ స్మార్ట్ ఫోన్ రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ 8GB ర్యామ్‌+128GB స్టోరేజ్‌, 6GB ర్యామ్‌+128 GB, 4GB+64 GB వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. ఐతే రియల్‌మీ 10 ప్రో+లో 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో అమోలెడ్ Display ను అందించనున్నారు. మీడియాటెక్‌  డైమెన్సిటీ 1080 ప్రాసెసర్‌తో ఈ స్మార్ట్ ఫోన్ పని చేస్తుంది.

ఈ స్మార్ట్ ఫోనులో మరింత పవర్‌ ఫుల్‌  బ్యాటరీని ఇవ్వనున్నారు. 65 వాట్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 4890mah బ్యాటరీని అందించనున్నారు. ఇక ధర చూసుకుంటే Realme 10 Series ఫోన్‌లు రూ. 15,000 నుంచి రూ. 25,000 మధ్య ఉండనున్నట్లు మార్కెట్‌ వర్గాల నుంచి సమాచారం.

Exit mobile version