Realme P3x 5G-P3 Pro 5G: రియల్‌మి తన Realme P3 సిరీస్‌ను ప్రారంభించింది. ఇందులో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి. Realme P3 Pro 5G, Realme P3x 5G పేరుతో ఇండియన్ మార్కెట్లోకి వచ్చాయి. తక్కువ బడ్జెట్ రేంజ్ సెగ్మెంట్‌లో వీటిని ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్స్ లుక్, ఫీచర్స్ వినియోగదారుల హృదయాలను గెలుచుకున్నాయి. ఈ రియల్‌మి P సిరీస్ ఫోన్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
రియల్‌మి P3x 5జీ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్‌తో విడుదలైంది. ఇది తేలికైన స్లిమ్ మొబైల్. ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ మొబైల్ 6.78 AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అలాగే 12GB RAM + 256GB స్టోరేజ్, 5500mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో సహా అనేక అద్భుతమైన ఫీచర్లతో లాంచ్ అయింది.
రియల్‌మి P3x 5జీ మొబైల్ Icefield డిజైన్‌తో వస్తుంది. ఇది లూనార్ సిల్వర్, మిడ్‌నైట్ బ్లూ, స్టెల్లార్ పింక్ కలర్స్‌లో విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్‌లో 8GB RAM ఉంది. ఇంతకు ముందు చెప్పినట్లుగా ఈ Realme P3x 5G ఒక తేలికపాటి స్లిమ్ స్మార్ట్‌ఫోన్. దీని మందం 7.94 మిమీ మాత్రమే.
రియల్‌మి P3 ప్రో 5జీ, రియల్‌మి P3x 5జీ స్మార్ట్‌ఫోన్‌లు ఈ రోజు అధికారికంగా లాంచ్ అయ్యాయి.ఈ ఈవెంట్‌లో రియల్‌మి P3x 5జీ,రియల్‌మి P3 ప్రో 5జీ ఫోన్‌లను భారత మార్కెట్‌లో పరిచయం చేసింది. రియల్‌మి P3x 5జీ మొబైల్ 6.78 అంగుళాల పెద్ద డిస్‌ప్లేతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది AMOLED ప్యానెల్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది.
రాబోయే రియల్‌మి P3x 5జీ ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో లాంచ్ అవుతుందని కంపెనీ తెలిపింది. ఈ మొబైల్‌లో గేమింగ్ కోసం, 6050mm VC కూలింగ్ సిస్టమ్ అందించారు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఓఎస్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ 12GB RAM తో లాంచ్ అవుతుంది. టాప్ వేరియంట్‌లో 512GB స్టోరేజ్ ఆప్షన్ ఉంటుంది.
రియల్‌మి P3x 5జీ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ మొబైల్ 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. మొబైల్ 5500mAh కెపాసిటీ బ్యాటరీతో ఇండియన్ మార్కెట్లో లాంచ్ అవుతుంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి, ఈ ఫోన్‌లో 80W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ ఉంటుంది.
రియల్‌మి P సిరీస్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది. ప్రస్తుత ధర గురించి ఎటువంటి సమాచారం వెల్లడి కాలేదు. అయితే, భారతదేశంలో Realme P3 ప్రో ధర రూ.21,999గా ఉండే అవకాశం ఉంది.