Site icon Prime9

Realme P3 5G: ఇదేదో భలేగా ఉందే.. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్‌తో రియల్‌మీ P3 5జీ.. ఫస్ట్ సేల్ ఎప్పుడంటే..?

Realme P3 5G

Realme P3 5G

Realme P3 5G: రియల్‌మీ కంపెనీ కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. దీంతో భారత్‌లో ‘పి’ సిరీస్‌ను విస్తరించింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Realme P3 5G స్మార్ట్‌ఫోన్ అధికారికంగా దేశీయ మార్కెట్లోకి ప్రవేశించింది. ఇది పెద్ద బ్యాటరీ, మంచి కెమెరా సెటప్‌తో వస్తుంది. కంపెనీ ఈ ఫోన్ ధరను రూ.20,000గా నిర్ణయించింది. బడ్జెట్‌లోనే ప్రవేశపెట్టారు. ఈ మొబైల్ ధర, లభ్యత,స్పెసిఫికేషన్‌ల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.

Realme P3 5G Features
రియల్‌మీ P3 5G ఫోన్‌లో GT బూస్ట్ ఉంది. ఇది AI మోషన్ కంట్రోల్, AI అల్ట్రా టచ్ కంట్రోల్‌తో సహా అనేక AI ఆధారిత ఫీచర్లను అందిస్తుంది. ఈ ఫీచర్‌లు గేమింగ్, యూజర్ అనుభవాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. AI అల్ట్రా టచ్ కంట్రోల్ టచ్ రెస్పాన్స్‌ని ఆప్టిమైజ్ చేస్తుంది. ఈ ఫోన్ ధర ఎంతో తెలుసుకోవాలంటే మొత్తం చదవండి.

రియల్‌మీ P3 5G స్మార్ట్‌ఫోన్‌లో 6.67-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఇది 2,400 × 1,080 పిక్సెల్‌ల రిజల్యూషన్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 1500Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్, 2,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. మొబైల్‌లో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ఆక్టా కోర్ ప్రాసెసర్ ఉంది. దీన్ని 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్లలో తయారు చేశారు. Realme UI 6.0 ఆధారంగా ఆండ్రాయిడ్ 15లో ఈ ఫోన్ రన్ చేస్తుంది.

రియ‌ల్‌మీ P3 5G ఫోన్ 6జీబీ ర్యామ్, 8జీబీ ర్యామ్‌తో వస్తుంది. ఇది 128జీబీ స్టోరేజ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. ఇది LED ఫ్లాష్‌తో వస్తుంది. ఇందులో 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం, ఈ ఫోన్ 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు.

రియ‌ల్‌మీ P3 5G మొబైల్ 6000mAh కెపాసిటీ బ్యాటరీ బ్యాకప్‌తో వస్తుంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి, ఈ ఫోన్‌లో 45W ఫాస్ట్ ఛార్జింగ్ అందించారు. ఫోన్‌లో USB టైప్-సి ఆడియో, స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. ఇది ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడాఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.2, GPS, NFC, USB టైప్-C ఉన్నాయి.

Realme P3 5G Price
6GB RAM + 128GB ధర = రూ. 16,999
8GB RAM + 128GB ధర = రూ. 17,999
8GB RAM + 256GB ధర = రూ. 19,999

రియల్‌మీ P3 5G మొబైల్ స్పేస్ సిల్వర్, కామెట్ గ్రే, నెబ్యులా పింక్ రంగులలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ (realme.com), ఫ్లిప్‌కార్ట్, ఆఫ్‌లైన్ స్టోర్‌ల ద్వారా ఫోన్ సేల్‌కి వస్తుంది. తొలి సేల్ మార్చి 19న సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరగనుంది. కంపెనీ మొదటి విక్రయానికి 2,000. బ్యాంక్ ఆఫర్ ప్రకటించింది. కంపెనీ ఇప్పటికే ఉన్న కస్టమర్లకు అదనంగా రూ. 500 ఆఫర్ చేస్తుంది.

Exit mobile version
Skip to toolbar