Prime9

Realme Narzo 80 Lite 5G Launched: అవాక్కయ్యారా మిత్రమా.. రూ.9,999కే రియల్‌మీ కొత్త ఫోన్.. ప్రైస్ ఊహించలేదు కదా..!

Realme Narzo 80 Lite 5G Launched

Realme Narzo 80 Lite 5G Launched

Realme Narzo 80 Lite 5G Launched: రియల్‌మీ తన తాజా బడ్జెట్-ఫ్రెండ్లీ 5G స్మార్ట్‌ఫోన్, రియల్‌మీ నార్జో 80 లైట్ 5Gని భారతదేశంలో విడుదల చేసింది. సరసమైన ధరకు శక్తివంతమైన బ్యాటరీతో కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేస్తూ, రియల్‌మీ ప్రముఖ నార్జో సిరీస్‌కు ఈ కొత్త వేరియంట్‌ను జోడించింది. దీనిని తదుపరి తరం కనెక్టివిటీని, శక్తివంతమైన వినియోగదారుల అనుభవాన్ని విస్తృత ప్రేక్షకులకు తీసుకురావడానికి రూపొందించింది కంపెనీ, దీని ధర రూ. 10,000 కంటే తక్కువ ధరకే ఆకర్షణీయమైన ప్యాకేజీని అందిస్తుంది.

 

Realme Narzo 80 Lite 5G Specifications
ఈ రియల్‌మీ నార్జో 80 లైట్ 5Gలో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5G చిప్‌సెట్ అందించారు. ఇది రోజువారీ టాస్క్‌లు, బ్రౌజింగ్, గేమింగ్ కోసం సున్నితమైన పనితీరును నిర్ధారిస్తుంది. 6జీబీ వరకు ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది, యాప్‌లు, మీడియాకు పుష్కలంగా స్థలాన్ని అందిస్తుంది. అలానే ఈ స్మార్ట్‌ఫోన్ 12జీబీ వర్చువల్ ర్యామ్‌కి సపోర్ట్ చేస్తుంది. ఇది మల్టీ టాస్కింగ్ సామర్థ్యాలను మరింత మెరుగుపరుస్తుంది.

 

రియల్‌మీ నార్జో 80 లైట్ 5G స్మార్ట్‌ఫోన్‌లో ఆకర్షణీయమైన డిస్‌ప్లే ఉంది. దీనిలో 6.67-అంగుళాల HD+ డిస్‌ప్లే, బట్టర్‌ఫుల్ స్మూత్ 120Hz రిఫ్రెష్ రేట్‌‌ని అందిస్తుంది. స్క్రోలింగ్, యానిమేషన్‌లను చాలా సున్నితంగా చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆటో ఫోకస్‌తో కూడిన 32MP మెయిన్ వెనుక కెమెరా ఉంది. అయితే 8MP ఫ్రంట్ కెమెరా క్వాలిటీ సెల్ఫీలు, వీడియో కాల్‌లను క్యాప్చర్ చేస్తుంది.

 

రియల్‌మీ నార్జో 80 లైట్ 5G డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం IP64 రేటింగ్‌ను అందిస్తుంది. దీనికి MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్ కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌‌లో 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీని చూడచ్చు. ఇది ఒకే ఛార్జ్‌పై ఎక్కువ వినియోగాన్ని హామీ ఇస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారంగా రియల్‌మీ UI 6.0 పై పనిచేస్తుంది. ఇది స్పష్టమైన వినియోగదారు ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది.

 

Realme Narzo 80 Lite 5G Price
రియల్‌మీ నార్జో 80 లైట్ 5G ధర చాలా తక్కువ. 4GB RAM వేరియంట్ ధర కేవలం రూ.9,999 నుండి ప్రారంభమవుతుంది. 6GB వేరియంట్ రూ.10,799కి లభిస్తుంది. ఇది స్టైలిష్ క్రిస్టల్ పర్పుల్, ఒనిక్స్ బ్లాక్ రంగులలో వస్తుంది. జూన్ 23 నుండి మీరు ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ప్రత్యేకంగా అమెజాన్ ద్వారా కొనుగోలు చేయచ్చు. పెద్దగా ఖర్చు పెట్టకుండా 5G కి అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకునే వారికి ఇది అందుబాటులో ఉండే ఆప్షన్.

Exit mobile version
Skip to toolbar