Site icon Prime9

Realme P1 5G: ఆహా అనిపించే ఆఫర్లు.. రియల్‌మి 5జీ ఫోన్‌పై వేలల్లో డిస్కౌంట్లు..!

Realme P1 5G

Realme P1 5G

Realme P1 5G: ప్రముఖ  ఆన్‌లైన్ ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్స్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వరుస ఆఫర్లతో జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సరికొత్త సేల్స్‌తో ఎలక్ట్రానిక్స్, గ‌ృహొపకరణాలు, స్మార్ట్‌ఫోన్లు తదితర వాటిపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే Realme P1 5Gపై ఊహించని డీల్‌ను తీసుకొచ్చాయి. ఫెస్టివల్ సేల్‌లో భాగంగా 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ.13 వేల కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌పై అందుబాటులో ఉన్న ఆఫర్ గురించి వివరంగా తెలుసుకుందాం.

128GB స్టోరేజ్‌తో Realme P1 5G స్మార్ట్‌ఫోన్ బేస్ వేరియంట్ ధర రూ. 14,999 . కస్టమర్‌లు 128GB స్టోరేజ్‌తో వేరియంట్‌ని ఎంచుకుంటే రూ. 2000 ఫ్లాట్ తగ్గింపు లభిస్తుంది. దీని ద్వారా ఫోన్‌ని రూ. 12,999కి  తగ్గుతుంది. ఇది కాకుండా 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 15,999. ఈ తగ్గింపు తర్వాత ఇది రూ. 13,999 ప్రభావవంతమైన ధరకు అందుబాటులో ఉంటుంది.

ఫ్లిప్‌కార్ట్ నుండి ఫోన్‌ను కొనుగోలు చేస్తే  ఎస్‌బీఐ కార్డ్, అమెజాన్‌లో డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ ప్రయోజనాన్ని ఐసిఐసిసి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌ల సహాయంతో పొందవచ్చు. కస్టమర్‌లు కోరుకుంటే తమ పాత ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేయడం ద్వారా ధరను భారీగా తగ్గించవచ్చు.

Realme P1 5G Specifications
రియల్‌మి బడ్జెట్ ఫోన్‌లో MediaTek Dimensity 7050 ప్రాసెసర్, గరిష్టంగా 8GB RAMతో 256GB వరకు స్టోరేజ్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లేను 1200నిట్‌ల పీక్ బ్రైట్నెస్, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో కలిగి ఉంది. వెనుక ప్యానెల్‌లో 50MP మెయిన్, 2MP డెప్త్ సెన్సార్‌తో డ్యూయల్ కెమెరా సెటప్, 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

ఇది అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది. Realme P1 5G స్మార్ట్‌ఫోన్ 5000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ బ్యాటరీ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫీనిక్స్ రెడ్, పీకాక్ గ్రీన్ అనే రెండు కలర్స్‌లో ఫోన్ ఆర్డర్ చేయచ్చు.

Exit mobile version