Site icon Prime9

Realme GT 7 Pro: అన్నొస్తున్నాడు.. దేశంలోనే మొదటిసారిగా.. రియల్‌మి సరికొత్త ఫోన్!

Realme GT 7 Pro

Realme GT 7 Pro

Realme GT 7 Pro: స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్‌మి కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇది Realme GT 7 Pro పేరుతో మార్కెట్‌లోకి రానుంది. ఈ మొబైల్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉంటుంది.  దేశంలో ఈ ప్రాసెసర్‌తో వస్తున్న మొదటి ఫోన్ ఇదే. నవంబర్‌లో ఫోన్ సేల్‌కి రానుంది. ఈ నేపథ్యంలో ఫోన్ ధర, ఫీచర్లు, తదితర వివరాలు తెలుసుకుందాం.

రియల్‌మి ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ తొలిసారిగా నవంబర్ 4న చైనాలో లాంచ్ కానుంది. ఆ తర్వాత దేశీయ మార్కెట్‌లోకి వస్తుంది. అయితే ప్రస్తుతం కంపెనీ అధికారిక విడుదల తేదీని ప్రకటించలేదు. నవంబర్ రెండో వారంలో కంపెనీ ఈ కొత్త ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్ మైక్రో క్వాడ్ కర్వ్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇందులో సామ్‌సంగ్ ఎకో OLED ప్లస్ ప్యానెల్ అందుబాటులో ఉంటుంది.

కంపెనీ Realme GT7 ప్రోని ‘AI పవర్‌హౌస్’గా పిలుస్తుంది. ఈ ఫోన్ Realme UI 6.0లో లాంచ్ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, AI స్కెచ్ టు ఇమేజ్, AI మోషన్ బ్లర్, AI గేమ్ సూపర్ రిజల్యూషన్, AI టెలిఫోటో అల్ట్రా క్లారిటీ వంటి AI ఫీచర్‌లు ఉన్నాయి. ఇమేజ్ ఎడిటింగ్, స్కెచ్ మేకింగ్ ఉన్నాయి. మొబైల్‌లో గేమింగ్ కూడా సులభం అవుతుంది.

రియల్‌మి GT7 ప్రో కంపెనీ ఇప్పటివరకు లాంచ్ చేసిన అత్యంత శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌గా ఉండనుంది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ధర రూ.60 వేలు ఉంటుంది. 12జీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ.55,000 ఉంటుంది. 16GB RAM స్టోరేజ్ ధర 65,000 కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

Realme GT 7 Pro Features
రియల్‌మి GT 7 Pro మొబైల్ 6.7 అంగుళాల 1.5K డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫోన్‌లో సామ్‌సంగ్ OLED ప్యానెల్ ఉంటుంది. అదనంగా క్వాల్‌కామ్ అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ ఉంది. ముందుగా చెప్పినట్లుగా క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో వస్తున్న మొదటి ఫోన్ రియల్‌మి GT 7 ప్రో.

రాబోయే రియల్‌మి GT 7 ప్రో మొబైల్‌లో 16GB RAM ఉంటుంది. మొబైల్  టాప్ వేరియంట్ UFS 4.0 స్టోరేజ్ ఆప్షన్‌తో 1TB మెమరీని కలిగి ఉంటుంది. ఈ ఫోన్  బేస్ వేరియంట్ 12GB RAMతో లాంచ్ అవుతుంది. ఇందులో 256GB స్టోరేజ్ ఉంటుంది.

కంపెనీ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో రియల్‌మి GT 7 ప్రోని పరిచయం చేస్తుంది. ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 టెలిఫోటో కెమెరా ఉంటుంది. ఇది పెరిస్కోప్ లెన్స్‌గా పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ మొబైల్‌లో AI టెలిఫోటో అల్ట్రా క్లారిటీ ఫీచర్ అందుబాటులో ఉంది. ఫోన్ 3x ఆప్టికల్ జూమ్, 120x డిజిటల్ జూమ్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6,500mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది సిలికాన్ కార్బన్ నెగటివ్ ఎలక్ట్రోడ్ బ్యాటరీ. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఫోన్‌లో 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.

Exit mobile version