Site icon Prime9

Realme GT 7 Pro Launched: ఇది ఏందయ్యా ఇది.. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో రియల్‌మి కొత్త ఫోన్.. ఇండియాలో ఫస్ట్ టైమ్..!

Realme GT 7 Pro Launched

Realme GT 7 Pro Launched

Realme GT 7 Pro Launched: రియల్‌మి తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్‌ను Realme GT 7 Pro పేరు మీదగా తీసుకొచ్చింది. కంపెనీ తాజాగా ఈ ఫోన్‌ను చైనాలో విడుదల చేసింది. ఫోన్ గరిష్టంగా 16 GB RAM + 1 TB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. చైనాలో దీని ప్రారంభ ధర 3699 యువాన్లు (దాదాపు రూ. 43,840). నవంబర్ 11 నుంచి చైనాలో ఈ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. ఇది నవంబర్ 26న భారతదేశంలో లాంచ్ అవుతుంది. కంపెనీ ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 120W ఫాస్ట్ ఛార్జింగ్‌ను అందిస్తోంది. ఈ ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

Realme GT 7 Pro Features
కంపెనీ ఈ ఫోన్‌లో 2780×1264 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.78 అంగుళాల 8T LTPO Eco² OLED ప్లస్ డిస్‌ప్లేను అందిస్తోంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. డిస్‌ప్లే పీక్ బ్రైట్నెస్ 6000 నిట్స్. ఫోన్ గరిష్టంగా 16GB వరకు LPDDR5x RAM + 1TB వరకు UFS 4.0 స్టోరేజ్‌తో వస్తుంది. ప్రాసెసర్‌గా కంపెనీ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌ను అందిస్తోంది.

ఫోటోగ్రఫీ కోసం ఫోన్‌లో LED ఫ్లాష్‌తో కూడిన మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్‌తో పాటు 50-మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్, 50-మెగాపిక్సెల్ 3x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం కంపెనీ ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందిస్తోంది. ఫోన్‌ను పవర్ చేయడానికి దీనిలో 6500mAh బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీ 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

ఓఎస్ గురించి మాట్లాడితే రియల్‌మి జీటీ7 ప్రో ఆండ్రాయిడ్ 15 ఆధారంగా Realme UI 6.0లో పనిచేస్తుంది. బయోమెట్రిక్ భద్రత కోసం కంపెనీ ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందిస్తోంది. మీరు ఫోన్‌లో IP68+IP69 డస్ట్, వాటర్ రెసిస్టెంట్ రేటింగ్‌ను కూడా పొందుతారు. మార్స్ ఆరెంజ్, స్టార్ ట్రైల్ టైటానియం, వైట్ అనే మూడు కలర్ ఆప్షన్‌లలో ఫోన్ లాంచ్ అవుతుంది.

Exit mobile version