Site icon Prime9

Realme 14x Launched: రియల్‌మి నుంచి బడ్జెట్ ఫోన్.. కిల్లర్ ఫీచర్లతో వచ్చేసింది.. సేల్ షురూ..!

Realme 14x Launched

Realme 14x Launched

Realme 14x Launched: చైనీస్ టెక్ కంపెనీ రియల్‌మి సరసమైన ధరలలో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లతో భారతీయ మార్కెట్లో తనదైన ముద్ర వేసింది. ఈ క్రమంలోనే తాజాగా రియల్‌మి 14x సక్సెసర్‌గా 14xని తీసుకురాబోతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ నుంచి డిసెంబర్ 18 మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోలు చేయచ్చు.  కంపెనీ చాలా కాలంగా ఈ ఫోన్‌ను టీజింగ్ చేస్తోంది. తాజాగా దాని ఫీచర్లను కూడా వెల్లడించింది. దీని గురించి పూర్తి వివరాలు తెెలుసుకుందాం.

Realme 14x ఈ రోజు లాంచ్ అయింది. దాని మొదటి సేల్ కూడా ఈరోజు ప్రారంభం కానుంది. ఈ ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్‌లు, కీలక ఫీచర్లు ఇప్పటికే టీజ్ చేసింది. కొన్ని అంశాలు సెగ్మెంట్‌లోని ఇతర పరికరాల కంటే మెరుగ్గా ఉన్నాయి. ఉదాహరణకు, ఈ ఫోన్ IP69 రేటింగ్‌తో వస్తుంది. నీటిలో తడిస్తే పాడైపోతుందనే భయం లేదు. అలాగే, ఇది శక్తివంతమైన 6000mAh బ్యాటరీని పొందబోతోంది.

Realme 14x Specifications
రియల్‌మి స్మార్ట్‌ఫోన్ వెనుక ప్యానెల్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ పొందబోతోంది. దీనిలో 50MP మెయిన్ కెమెరా లెన్స్ ఉంటాయి. IP69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో పాటు ఈ మొబైల్ మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌ను కూడా పొందింది. మొత్తంమీద ఇది బలమైన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి. ఈ ఫోన్‌లో MediaTek Dimensity 6300 ప్రాసెసర్‌ ఉంటుంది. దానితో పాటు 8GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ బేస్ మోడల్‌లో లభిస్తాయని ఊహాగానాలు ఉన్నాయి.

ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ 6000mAh సామర్థ్యంతో శక్తివంతమైన బ్యాటరీని కలిగి ఉంటుంది, ఇది పూర్తి ఛార్జ్‌పై రెండు రోజుల వరకు బ్యాకప్‌ను అందిస్తుంది. ఫోన్ పూర్తిగా ఛార్జ్ అయినప్పుడు, ఇది 15 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ సమయాన్ని పొందుతుందని పేర్కొంది. ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారంగా Realme UI 4.0 స్కిన్‌ని కలిగి ఉంది. మొబైల్ మిగిలిన స్పెసిఫికేషన్లు లాంచ్ సమయంలో బయటకు వస్తాయి.

Realme 14x Price
రియల్‌మి 14x భారతీయ మార్కెట్లో 15,000 రూపాయల కంటే తక్కువ ప్రారంభ ధరతో విడుదల చేయవచ్చని కంపెనీ లాంచ్‌కు ముందే ధృవీకరించింది. ఈ ఫోన్‌ను క్రిస్టల్ బ్లాక్, గోల్డెన్ ఎల్లో, జ్యువెల్ రెడ్ అనే మూడు కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు.

Exit mobile version