Site icon Prime9

Realme P1 Speed 5G Price Drop: అరాచకం బాబోయ్.. రియల్‌మి స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఆఫర్.. దీన్ని వదలొద్దు..!

Realme P1 Speed 5G

Realme P1 Speed 5G

Realme P1 Speed 5G Price Drop: టెక్ కంపెనీ రియల్‌మి ఇప్పటికే వివిధ మొబైల్స్ ద్వారా దేశీయ మార్కెట్లో స్థిరపడింది. కంపెనీకి చెందిన బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్లు విపరీతంగా సందడి చేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఇప్పుడు Realme P1 Speed 5G మొబైల్ ఆకర్షణీయమైన ఫీచర్లతో పాటు 50 మెగాపిక్సెల్ సెన్సార్‌తో కూడిన AI కెమెరాను కలిగి ఉంది. ప్రస్తుతం భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. Realme P1 Speed 5G ఫోన్ ప్రముఖ ఇ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది.

14 శాతం తగ్గింపు ధరతో కొనుగోలు చేయొచ్చు. ఇప్పుడు కస్టమర్లు ఈ ఫోన్  8 GB RAM + 128 GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ. 17,999కి పొందచ్చు. ఈ ఫోన్ MediaTek Dimensity 7300 ప్రాసెసర్ పవర్‌తో పని చేస్తుంది. అదేవిధంగా ఈ తాజా స్మార్ట్‌ఫోన్ 5,000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అదనంగా ఫోన్ 8GB + 128GB, 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్‌లు ఉన్నాయి. మరి ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

Realme P1 Speed 5G Specifications
Realme P1 స్పీడ్ 5G స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 2400×1080 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌‌తో వస్తుంది. డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్, పాండా గ్లాస్ ప్రొజెక్షన్‌కి సపోర్ట్ చేస్తుంది. మొబైల్ MediaTek Dimensity 7300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది Mali-G615 MC2 GPUని కలిగి ఉంది. ఇది ఆండ్రాయిడ్ 14 సపోర్ట్‌తో పని చేస్తుంది. ఇది 8GB RAM / 12GB, 128GB RAM / 256GB స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.

మొబైల్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ప్రైమరీ కెమెరాలో 50-మెగాపిక్సెల్ AI సెన్సార్ ఉంది. రెండవ కెమెరాలో 2MP సెన్సార్ ఉంది. ఇది కాకుండా 16 మెగాపిక్సెల్ సెన్సార్‌తో కూడిన సెల్ఫీ కెమెరా అందించారు. అలానే మొబైల్ 5,000mAh బ్యాటరీ బ్యాకప్‌ను కలిగి ఉంది. అదనంగా ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది బ్లూటూత్ 5.4, బీడౌ, GPS, GLONASS, గెలీలియో, QZSS, USB టైప్-సి ఆప్షన్లను కూడా పొందుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్, 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్‌లో అందుబాటులో ఉంది.

Exit mobile version