Site icon Prime9

Realme GT 7 Pro Launched: ఇదే మొదటిది.. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో రియల్‌మి జీటీ 7 ప్రో.. ఇప్పుడే బుక్ చేయండి..!

Realme GT 7 Pro Launched

Realme GT 7 Pro Launched

Realme GT 7 Pro Launched: టెక్ మేకర్ రియల్‌మి తన బ్రాండ్ పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్ Realme GT 7 Proను విడుదల చేసింది. ఇది కొన్ని నెలల క్రితం మార్కెట్లోకి వచ్చిన  Realme GT 6కి సక్సెసర్‌గా వస్తుంది. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ కొన్ని రోజుల క్రితం చైనాలో లాంచ్ అయింది. ఈ ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో వచ్చిన కంపెనీ మొదటి ఫోన్. iQOO 13, Xiaomi 15, Samsung Galaxy S25 సిరీస్ మొదలైన వాటితో సహా ఈ ప్రాసెసర్‌తో అనేక ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లను రాబోయే రోజుల్లో భారతీయ మొబైల్ ప్రియులకు అందుబాటులోకి రానున్నాయి.

Realme GT 7 Pro Price
రియల్‌మి జీటీ 7 ప్రో భారతదేశంలో రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో ఉంది. అందులో 12GB RAM + 256GB, 16GB RAM + 512GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి. దీని బేస్ వేరియంట్ ధర రూ. 56,999. దీని టాప్ వేరియంట్ ధర రూ.62,999. ఇది గెలాక్సీ గ్రే,  ఆరెంజ్ అనే రెండు కలర్ ఆప్షన్లలో వచ్చింది. ఫోన్  మొదటి లాంచ్ నవంబర్ 29 ఉదయం 12 గంటలకు దాని ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో జరుగుతుంది. రూ.999 చెల్లించి ఈరోజు నుంచి ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. ప్రీ-బుకింగ్‌పై బ్యాంక్ డిస్కౌంట్ రూ. 3,000,  నో-కాస్ట్ EMI ఆఫర్ కూడా ఉంది. అలానే వినియోగదారులు 1 సంవత్సరం పాటు ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్ అందిస్తుంది.

Realme GT 7 Pro Features
ఈ ఫోన్ 6.78 అంగుళాల 1.5K LTPO Eco2 OLED ప్లస్ క్వాడ్ కర్వ్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఫోన్ డిస్‌ప్లే రిజల్యూషన్ 1264 x 2780 పిక్సెల్స్. ఫోన్ డిస్‌ప్లే 120Hz అధిక రిఫ్రెష్ రేట్, HDR10+,  గరిష్టంగా 6,500 నిట్‌ల వరకు బ్రైట్‌నెస్ ఫీచర్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అందించారు.

ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో వస్తుంది. ఫోన్ 16GB RAM + 512GB UFS 4.0 స్టోరేజ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్ 5,800mAh సిలికాన్ కార్బన్ నెక్స్ట్ జనరేషన్ టైటాన్ బ్యాటరీతో వస్తుంది. ఫోన్‌లో 120W USB టైప్ C SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ ఉంది. ఈ ఫోన్ IP69+ రేటింగ్‌‌కు సపోర్ట్ ఇస్తుంది. దీని కారణంగా మీరు  నీటిలో కూడా ఉపయోగించవచ్చు.

ఈ స్మార్ట్‌ఫోన్ Android 15 ఆధారంగా Realme UI 6.0 తో వస్తుంది. ఫోన్ బలమైన పనితీరుతో పాటు తదుపరి AI ఫీచర్‌ను కలిగి ఉంది. ఫోన్‌లో కనెక్టివిటీ కోసం డ్యూయల్ బ్యాండ్ Wi-Fi6, బ్లూటూత్ 5.4, NFC వంటి ఫీచర్లు అందించారు. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ వంటి ఫీచర్లను ఫోన్‌లో ఉన్నాయి. ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది.

ఫోన్‌లో 50MP ప్రధాన OIS కెమెరా ఉంది. ఇది కాకుండా 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను కలిగి ఉంది. ఇది 3x ఆప్టికల్ జూమ్, 120x సూపర్ జూమ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ కెమెరాలో హైపర్‌మేజ్+ ఫీచర్ అందించారు. ఇది 8K రిజల్యూషన్ వీడియోను రికార్డ్ చేయగలదు. సెల్ఫీ,  వీడియో కాలింగ్ కోసం ఇది 16MP కెమెరాను కలిగి ఉంది.

Exit mobile version