Realme P3 Pro 5G Discounts: రియల్‌మి కొన్ని రోజుల క్రితం భారతదేశంలో రియల్‌మి పి3 ప్రో 5జీని విడుదల చేసింది. ఇప్పుడు రియల్‌మి పి-కార్నివాల్ సేల్ సందర్భంగా కంపెనీ ఈ ఫోన్‌పై రూ.4000 తగ్గింపును అందిస్తోంది. రియల్‌మి ఈ సేల్ ఈరోజు ఏప్రిల్ 22 నుండి ప్రారంభమై ఏప్రిల్ 24 వరకు కొనసాగుతుంది. సేల్ సమయంలో కొనుగోలుదారులు ఎక్స్ఛేంజ్ బోనస్ ప్రయోజనాన్ని కూడా పొందచ్చు. రియల్‌మి ఫోన్‌లలో లభించే ఆఫర్‌ల గురించి వివరంగా తెలుసుకుందాం.
Realme P3 Pro 5G Offers
రియల్‌మి పి3 ప్రో 5జి స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో రూ.23999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ఆఫర్‌తో, ఈ ఫోన్‌ను రూ.19,999 ధరకు కొనుగోలు చేయవచ్చు. రియల్‌మి పి-కార్నివాల్ సేల్ సమయంలో, కొనుగోలుదారులు రూ. 4000 వరకు బ్యాంక్ డిస్కౌంట్ లేదా రూ. 3000 ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు.
ఈ రియల్‌మి ఫోన్ నెబ్యులా గ్లో, గెలాక్సీ పర్పుల్, సాటర్న్ బ్రౌన్ అనే మూడు కలర్ ఆప్షన్స్‌లో వస్తుంది. రియల్‌మీ పి-కార్నివాల్ సేల్ ఏప్రిల్ 22 నుండి ప్రారంభమై ఏప్రిల్ 24 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ వెబ్‌సైట్, రిటైల్ స్టోర్‌లలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.
Realme P3 Pro 5G Specifications
రియల్‌మి పి3 ప్రో 5జి స్మార్ట్‌ఫోన్‌లో 6.83-అంగుళాల 1.5 కె కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌కి సపోర్ట్ చేస్తుంది. ఈ రియల్‌మి ఫోన్ క్వాల్‌కమ్ స్నప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. దీనిలో గ్రాఫిక్స్ కోసం అడ్రినో 720 GPU అందించారు. 12జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 6.0 ఆధారంగా Realme UI 15 పై రన్ అవతుంది.
ఈ రియల్‌మి ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, దీని ప్రైమరీ కెమెరా 50MP సోనీ IMX896 సెన్సార్. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్‌లో 2MP డెప్త్ సెన్సార్ ఉంది. దీనితో పాటు, సెల్ఫీ కోసం ఈ రియల్‌మి ఫోన్‌లో 16MP ఫ్రంట్ కెమెరా అందించారు. స్మార్ట్‌ఫోన్‌లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది, ఇది 80W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే, ఈ ఫోన్ డ్యూయల్ 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్,USB టైప్-C లతో పాటు 5G సపోర్ట్ ఉంది. దీనితో పాటు, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కూడా ఇందులో అందించారు.