Site icon Prime9

Realme 14 5G: ఆహా అదిరిందిగా.. రియల్‌మీ నుంచి కొత్త సిరీస్ ఫోన్.. ఇది మనకోసమే గురూ..!

Realme 14 5G

Realme 14 5G

Realme 14 5G: రియల్‌మీ కంపెనీ కొత్త సిరీస్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఇది Realme 14 5G సిరీస్. ఇందులో కొత్త Realme 14 5G మొబైల్ భారతదేశంలో ప్రారంభించనుంది. హై క్వాలిటీ ఫీచర్లతో పాటు స్టైలిష్ డిజైన్‌తో ఈ మొబైల్ లాంచ్ కానుంది. కంపెనీ తన అధికారిక X ఖాతాలో ఈ కొత్త సిరీస్ టీజర్‌ను షేర్ చేసింది. ఇప్పుడు ఈ ఫోన్ ప్రాసెసర్ , బ్యాటరీ వివరాలు వెల్లడయ్యాయి.

Realme 14 5G Price
Realme 14 5G ఫోన్ రియల్‌మీ 14 5జీ సిరీస్ క్రింద పరిచయం చేశారు. ఇది మిడ్ బడ్జెట్ ఫోన్. ఈ కొత్త ఫోన్ ధర రియల్‌మీ 14x 5జీ, రియల్‌మీ 14 ప్రో లైట్ 5జీ ధరలను పోలి ఉంటుంది. అంటే, Realme 14 5G ఫోన్‌ను రూ.15,000. 20,000 రూపాయలలోపు విడుదల చేయచ్చు. మీరు ఈ Realme 5G మొబైల్‌ను పింక్, సిల్వర్, టైటానియం కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయచ్చు.

Realme 14 5G Features
రియల్‌మీ 14 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 6.67-అంగుళాల ఫుల్ HD ప్లస్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది పంచ్ హోల్ స్టైల్ అమోలెడ్ స్క్రీన్. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ రియల్‌మీ మొబైల్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీన్ని 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ల ఆధారంగా తయారు చేశారు.

Realme 14 5G ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. లీక్ ప్రకారం, ఫోన్ 50 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంటుంది. ఇది OIS మద్దతుతో వస్తుంది. సెకండరీ లెన్స్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఫోన్‌లో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉంది. ఈమొబైల్ 8జీబీ ర్యామ్, 12జీబీ ర్యామ్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో ఎక్స్‌పాండబుల్ ర్యామ్ టెక్నాలజీ కూడా ఉంది. ఈ రెండు వేరియంట్లలో 256GB స్టోరేజ్ ఆప్షన్ ఉంది.

Realme 14 5G మొబైల్ 6,000mAh కెపాసిటీ బ్యాటరీతో మార్కెట్లో లాంచ్ అవుతుంది. రియల్‌మీ 14x 5జీ ఫోన్‌లో కూడా అదే బ్యాటరీ అందించారు. లీక్ ప్రకారం, Realme 14 5G ఫోన్‌లో 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi, బ్లూటూత్ , USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి.

Exit mobile version
Skip to toolbar