Poco X7 5G Series: చైనీస్ టెక్ బ్రాండ్ పోకో Poco X7 సిరీస్ సేల్ నేటి నుండి భారతీయ మార్కెట్లో ప్రారంభమవుతుంది. ఈ సిరీస్ రెండు ఫోన్లను ప్రత్యేక తగ్గింపుతో కొనుగోలు చేయచ్చు. దీనిలో Poco X7 5G, Poco X7 Pro 5G స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. కొత్త పోకో ఫోన్లు 50MP ప్రైమరీ కెమెరా సెటప్, అద్భుతమైన బ్యాకప్‌ని అందించే బ్యాటరీని కలిగి ఉన్నాయి. మీరు కూడా ఈ ఫోన్లను కొనుగోలు చేయాలని చేస్తుంటే వీటి ఫీచర్లు, ఆఫర్లు తదితర వివరాలు తెలుసుకుందాం.
Poco X7 5G Offers
POCO X7 ప్రారంభ ధర రూ. 19,999గా ఉంచారు. ఇది 8GB RAM+ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన బేస్ వేరియంట్ ధర. ఈ ఫోన్ టాప్ వేరియంట్ 8GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. దీని ధర రూ. 21,999. మొదటి సేల్‌లో ఏదైనా బ్యాంక్ కార్డ్ ద్వారా చెల్లింపుపై మీకు రూ. 2,000 తగ్గింపు కూడా లభిస్తుంది.
అయితే, POCO X7 Pro ధర రూ. 24,999 నుండి మొదలవుతుంది. ఈ ధర 8GB RAM + 256GB స్టోరేజ్‌తో కూడిన బేస్ వేరియంట్ కోసం. దీని టాప్ వేరియంట్ 12GB RAM+ 256GB స్టోరేజ్‌తో వస్తుంది. దీని ధర రూ.26,999గా ఉంచారు. ఈ ఫోన్‌పై రూ.2,000 అదనపు తగ్గింపు కూడా ఇస్తుంది.
Poco X7 5G Specifications
ఈ ఫోన్ MediaTek Dimensity 7300 అల్ట్రా ప్రాసెసర్‌తో వస్తుంది. ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది, ఇందులో 50MP సోనీ LYT600 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్, 2MP థర్డ్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇది 20MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. దీనిలో 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5500mAh బ్యాటరీ ఉంది.
Poco X7 Pro 5G Specifications
ఈ స్మార్ట్‌ఫోన్ 6.73-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది, ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 3000నిట్స్ పీక్ బ్రైట్నెస్‌తో వస్తుంది. ఈ ఫోన్ MediaTek Dimensity 8400 అల్ట్రా ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఫోటోగ్రఫీ కోసం 50MP Sony LYT600 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ సెన్సార్ ఉన్నాయి. అయితే సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 20MP ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది. ఫోన్ పెద్ద 6550mAh బ్యాటరీని కలిగి ఉంది, ఇది 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.