POCO M6 5G Price Drop: ఆన్‌లైన్ షాపింగ్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బచాత్ సేల్ లైవ్ అవుతుంది. ఈ స్పెషల్ సేల్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Poco M6 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో 6.74 అంగుళాల డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు అనేక గొప్ప ఫీచర్లు ఉన్నాయి. మీరు ఈ మొబైల్ ఆర్డర్ చేయాలనుకుంటుంటే దీని ధర, ఆఫర్లు,ఫీచర్లు తదితర వివరాలు తెలుసుకుందాం.
పోకో M6 5G ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ సేల్‌లో 29 శాతం తగ్గింపుతో రూ. 8,499కి అందుబాటులో ఉంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులను ఉపయోగించి ఈ ఫోన్ కొనుగోలుపై రూ.500 తగ్గింపు కూడా ఉంది. కాబట్టి మీరు ఈ ఫోన్‌ను రూ.7999 ధరతో కొనుగోలు చేయచ్చు.
POCO M6 5G Specifications
Poco M6 5G స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ 6nm చిప్‌సెట్‌తో ఆధారితమైనది. ఈ చిప్‌సెట్ మెరుగైన పనితీరును అందిస్తుంది. ఫోన్‌లో Arm Mali-G57 MC2 GPU (Arm Mali-G57 MC2 GPU) గ్రాఫిక్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ ఫోన్ మెరుగైన గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఫోన్ 6.74-అంగుళాల HD+ డిస్ప్లేతో వస్తుంది. దాని డిస్ప్లే 90 Hz రిఫ్రెష్ రేట్, 600 nits బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, అనేక ఇతర ఫీచర్లను కలిగి ఉంది. ఫోన్ పెద్ద డిస్‌ప్లేతో వస్తుంది, ఇది ఉపయోగించడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది.
Poco M6 5G స్మార్ట్‌ఫోన్‌లో 50MP AI డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. కాబట్టి మీరు ఈ స్మార్ట్‌ఫోన్ సహాయంతో అద్భుతమైన ఫోటోలు, వీడియోలను తీసుకోవచ్చు. ఈ ఫోన్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5MP కెమెరాతో వస్తుంది. ఇది కాకుండా,ఫోన్ LED ఫ్లాష్, వివిధ కెమెరా ఫీచర్లను కలిగి ఉంది. ఫోన్ 3.5mm ఆడియో జాక్, FM రేడియో, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, డస్ట్, స్ప్లాష్ రెసిస్టెంట్‌తో సహా అనేక అద్భుతమైన ఫీచర్లతో విడుదల చేయడం గమనార్హం.
అలానే ఈ పోకో ఫోన్ 5000mAh బ్యాటరీతో వచ్చింది. అంటే ఈ ఫోన్ సుదీర్ఘ బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. ఇందులో 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది. ముఖ్యంగా ఈ ఫోన్ డిజైన్ చాలా బాగుంది. స్మార్ట్‌ఫోన్‌లో 5G, డ్యూయల్ 4G VoltE, Wi-Fi 802.11 ac, బ్లూటూత్ 5.3, GPS, USB టైప్-సి పోర్ట్‌తో సహా వివిధ కనెక్టివిటీ సపోర్ట్ ఉంది. ఈ Poco మోడల్ 4GB RAM+64GB మెమరీని కలిగి ఉంది. ఇది కాకుండా Poco M6 5G స్మార్ట్‌ఫోన్ వివిధ అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది.