Site icon Prime9

Oppo Reno 13 5G Sky Blue Variant Launch: కొత్త స్కై బ్లూ కలర్‌లో ఒప్పో రెనో.. ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. మార్చి 20న మొదటి సేల్..!

Oppo Reno 13 5G Sky Blue Variant Launch

Oppo Reno 13 5G Sky Blue Variant Launch

Oppo Reno 13 5G Sky Blue Variant Launch: Oppo తన కస్టమర్లను సంతోషపెట్టే వార్తలను అందించింది. ‘OPPO Reno13 5G’ ప్రముఖ ఫోన్‌ను కొత్త రంగులో విడుదల చేసింది. అవును, OPPO Reno13 సిరీస్ Oppo ఫోన్‌లలో అత్యంత ఖరీదైన, అల్ట్రా ప్రీమియం మోడల్. ఈ ఫోన్ రెండు రంగులలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడు, స్కై బ్లూ కలర్ వేరియంట్‌లో పరిచయం చేసింది. ఈ కొత్త కలర్, ఫోన్ ధర, స్పెసిఫికేషన్‌ల గురించి వివరంగా తెలుసుకుందాం.

Oppo Reno13 5G Price And Offers
Oppo Reno13 5G మొబైల్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో లాంచ్ అయింది. ఈ ఫోన్ 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ.43,999కి కొనుగోలు చేయచ్చు. అలాగే, 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.39,999కి లాంచ్ అయింది. కంపెనీ ఈ ఫోన్ కొనుగోలుపై 3,750 బ్యాంక్ డిస్కౌంట్ ప్రకటించింది. స్కై బ్లూ కలర్ వేరియంట్ మార్చి 20 నుండి Oppo ఈ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్ ఇతర రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా విక్రయించనుంది.

Oppo Reno13 Features
Oppo Reno13 5G స్మార్ట్‌ఫోన్ 6.59-అంగుళాల 1.5K డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది పంచ్ హోల్ స్టైల్ అమోలెడ్ డిస్‌ప్లే. ఈ డిస్ప్లే 2,760 x 1,256 పిక్సెల్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 12,00 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. మొబైల్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ColorOS 15.0తో పనిచేస్తుంది.

Oppo Reno13 5G ఫోన్ 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది OIS, LED ఫ్లాష్‌తో వస్తుంది. ఇందులో 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా కూడా ఉంది. సెల్ఫీ , వీడియో కాలింగ్ కోసం, ఈ మొబైల్ 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫోన్ 5,600mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి, 80W ఫాస్ట్ ఛార్జింగ్ అందించారు. ఈ మొబైల్‌కి IP69, IP68, IP66 రేటింగ్ అందించారు.

Exit mobile version
Skip to toolbar