Site icon Prime9

Oppo K13 5G Launch: 50MP AI కెమెరా, 7000mAh బ్యాటరీ.. Oppo K13 5G స్మార్ట్‌ఫోన్.. బడ్జెట్‌లో హై క్లాస్ ఫీచర్స్!

Oppo K13 5G

Oppo K13 5G

Oppo K13 5G Price, Specifications and Launch Date: Oppo K13 5G స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంచ్ కానుంది. ఇది కంపెనీ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ అవుతుంది. ఈ ఫోన్ సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది. ఫోన్‌ మైక్రోసైట్ ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఈ సైట్ ద్వారా ఫోన్ అనేక ఫీచర్లు తెలుసుకోవచ్చు. ఈ ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ ప్రాసెసర్ ఉంటుంది. అలానే 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన డిస్ప్లేతో వస్తుంది. ఫోటోగ్రఫీ కోసం, ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా అందించారు. దీని గురించి పూర్తి వివరాలపై తెలుసుకోవాలంటే.. ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి..!

 

Oppo K13 5G Launch Date
Oppo K13 5G ఫోన్ భారతదేశంలో లాంచ్ తేదీని కంపెనీ ధృవీకరించింది. ఈ ఫోన్ ఏప్రిల్ 21న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతుంది. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయచ్చు. ఫోన్‌కు మైక్రోసైట్ ఫ్లిప్‌కార్ట్‌లో లైవ్ చేశారు. ఈ సైట్ ద్వారా ఫోన్ అనేక ఫీచర్లు వెల్లడయ్యాయి.

 

Oppo K13 5G Specifications
ఈ ఫోన్‌కు 120Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లే అందించారు. ఈ డిస్‌ప్లే 1200 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ అందుబాటులో ఉంటుంది. ఇది కాకుండా, ఫోన్‌లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఇది 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో అందుబాటులో ఉంటుంది.

 

Oppo K13 5G Price
ఫోటోగ్రఫీ కోసం, ఫోన్‌లో 50MP AI కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 7000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ బ్యాటరీకి 80W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ సపోర్ట్‌ అందించారు. ఈ ఫోన్ 30 నిమిషాల్లో 62 శాతం వరకు ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్ రెండు రంగు ఎంపికలలో లభిస్తుంది – ఐసీ పర్పుల్, ప్రిజం బ్లాక్. ఫోన్‌లో స్ప్లాష్ టచ్‌కు కూడా కంపెనీ సపోర్ట్ ఇస్తుంది. దీని ధర రూ. 20,000 కంటే తక్కువగా ఉంటుంది. కొత్త మోడల్ దాని గ్లోబల్ లాంచ్‌కు ముందు మొదట భారతదేశంలో ప్రారంభమవుతుంది.

Exit mobile version
Skip to toolbar