OPPO A5 Pro 5G Launch: ఏప్రిల్ నెల ఒప్పో అభిమానులకు ప్రత్యేకమైనదిగా నిరూపించబడుతోంది. ఏప్రిల్ 21న, కంపెనీ OPPO K13 5G ఫోన్‌ను తీసుకువస్తోంది. అదే సమయంలో ఈరోజు బ్రాండ్ ఈ వారం ఏప్రిల్ 24న భారతదేశంలో OPPO A5 Pro 5G ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ రాబోయే ఒప్పో 5G ఫోన్ ఫోటో, లాంచ్ తేదీతో పాటు, దాని ముఖ్యమైన ఫీచర్లను కోడా కంపెనీ వెల్లడించింది.
OPPO A5 Pro 5G Launch Date
ఒప్పో కంపెనీ తన కొత్త 5G ఫోన్ A5 Pro ను ఏప్రిల్ 24న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ 5G ఒప్పో మొబైల్ ధర, అమ్మకపు వివరాలు వర్చువల్ లాంచ్ ఈవెంట్ ద్వారా వెల్లడికానున్నాయి. ఈ మొబైల్‌కి IP69 రేటింగ్ అందించారు. ఇది వాటర్ ప్రూఫ్ ఫోన్ అని కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్ నీరు, దుమ్ము నుండి రక్షిస్తుంది.
OPPO A5 Pro 5G Specifications
Oppo A5 Pro 5G స్మార్ట్‌ఫోన్ ప్రపంచ మార్కెట్లో విడుదలైంది. మొబైల్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ColorOS 15 పై రన్ అవుతుంది. ప్రాసెసింగ్ కోసం, ఈ మొబైల్‌లో 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్‌లపై నిర్మించిన మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉంది, ఇది 2.4GHz వరకు క్లాక్ స్పీడ్‌తో నడుస్తుంది. ఈ ఫోన్ చైనీస్ మోడల్ డైమెన్సిటీ 7300 కు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ ప్రపంచ మార్కెట్లో రెండు మెమరీ వేరియంట్లలో విడుదలైంది. బేస్ వేరియంట్ 6జీబీ ర్యామ్,128జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. పెద్ద వేరియంట్ 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. రెండు వేరియంట్లు వర్చువల్ ర్యామ్‌కి సపోర్ట్ ఇస్తాయి.
OPPO A5 Pro స్మార్ట్‌ఫోన్‌లో 1604 × 720 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల HD+ డిస్‌ప్లే ఉంది. ఇది పంచ్-హోల్ స్టైల్ LCD స్క్రీన్, ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1000నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. ఫోటోగ్రఫీ కోసం, ఈ ఒప్పో 5G ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. దాని వెనుక ప్యానెల్‌లో, LED ఫ్లాష్‌తో 50-మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ ఉంది, ఇది 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
OPPO A5 Pro 5G ఫోన్ ప్రపంచ మార్కెట్లో 5,800mAh బ్యాటరీ , చైనాలో 6,000mAh బ్యాటరీతో లాంచ్ అయింది. ఫోన్ గ్లోబల్ మోడల్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ ఇస్తుంది. మొబైల్ IP69 రేటింగ్ పొందింది. కనెక్టివిటీ కోసం, ఫోన్‌లో బ్లూటూత్ 5.3, వైఫై 5 తో పాటు NFC కూడా ఉంది. భద్రత, ఫోన్ అన్‌లాకింగ్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు.