Site icon Prime9

OnePlus Mobile Offers: ఆఫర్ల మానియా.. వన్‌ప్లస్ స్పెషల్ సేల్.. ఈ రెండు ఫోన్లపై డిస్కౌంట్లే డిస్కౌంట్లు..!.

OnePlus Mobile Offers

OnePlus Mobile Offers

OnePlus Mobile Offers: స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కు వన్‌ప్లస్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. మొబైల్ లవర్స్‌కు బంపర్ డిస్కౌంట్లు అందిస్తోంది. ఈ ఆఫర్లన్ని కంపెనీ అఫిషియల్ వెబ్‌సైట్‌లో లైవ్ అవుతున్నాయి. ఆఫర్లపై OnePlus Nord 4,  OnePlus 12R స్మార్ట్‌ఫోన్లను తక్కువ ధరకే కొనుగోలు చేయచ్చు. ఈ ఫోన్లపై కంపెనీ రూ.3 వేల వరకు తగ్గింపు ఇస్తోంది. జియో ప్లస్ పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు ఆఫర్‌లో ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ. 2250 విలువైన ప్రయోజనాలను కూడా పొందుతారు. అంతేకాకుండా ఈ ఫోన్‌లను ఆకర్షణీయమైన నో-కాస్ట్ EMIతో కూడా దక్కించుకోవచ్చు. కాబట్టి వన్‌ప్లస్ ఈ ఫోన్‌లలో అందిస్తున్న డీల్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.

OnePlus12 R
వన్‌ప్లస్ 12 ఆర్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఫోన్ వేరియంట్ ధర రూ.38,999. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ. 3 వేల వరకు తక్షణ తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్ ICICI, RBL బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై అందిస్తున్నారు. అలానే జియో ప్లస్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల వినియోగదారులు ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ. 2250 విలువైన ప్రయోజనాలను పొందుతారు. మీరు ఈ ఫోన్‌ను 6 నెలల నో-కాస్ట్ EMIపై కూడా మీ సొతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే ఈ ఫోన్‌లో 6.78 అంగుళాల AMOLED ProXDR LTPO 4.0 డిస్‌ప్లేను పొందుతారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోటోగ్రఫీ కోసం ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఫోన్  బ్యాటరీ 5500mAh, ఇది 100 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

OnePlus Nord 4
వన్‌ప్లస్ నార్డ్ 4  స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కంపెనీ అఫిషియల్ సైట్‌లో రూ. 27,999కి అందుబాటులో ఉంది. ఆఫర్‌లో రూ.2 వేల తగ్గింపుతో కొనుగోలు చేయచ్చు. ఈ ఆఫర్ ICICI, RBL బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్ల కోసం. ఈ ఫోన్‌తో పాటు, జియో ప్లస్ పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు కంపెనీ 2250 రూపాయల ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ఫోన్‌ను 6 నెలల నో-కాస్ట్ EMIలో కూడా కొనుగోలు చేయవచ్చు. మీరు ఈ ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.74 అంగుళాల AMOLED డిస్‌ప్లే పొందుతారు. వన్‌ప్లస్ ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 Plus Gen 3 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. దీని మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్స్. ఫోన్‌ను పవర్ చేయడానికి ఇది 5500mAh బ్యాటరీతో అందించారు. ఇది 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Exit mobile version