Site icon Prime9

OnePlus 13 Mini: వన్‌ప్లస్ పెద్ద ప్లాన్.. త్వరలో మినీ ఫోన్ లాంచ్.. అదిరింది..!

OnePlus 13 Mini

OnePlus 13 Mini: వన్‌ప్లస్ తన 13 సిరీస్‌లో OnePlus 13 Miniని ప్రవేశపెట్టవచ్చని భావిస్తున్నారు.అయితే దానికి సంబంధించిన కచ్చితమైన వివరాలు బయటకు రాలేదు. ప్రస్తుతం OnePlus 13 మినీ మోడల్ లాంచ్ టైమ్‌లైన్ అందుబాటులోకి రాలేదు. అలాగే డిస్‌ప్లే, చిప్‌సెట్, కెమెరా, బ్యాటరీ ముఖ్యమైన ఫీచర్లు కూడా ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. మునుపటి నివేదికలు వన్‌ప్లస్ 13 మినీ ఒక చిన్న ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లో పనిచేస్తోంది. రండి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

వన్‌ప్లస్ 13 మినీ స్మార్ట్‌ఫోన్ చాలా ముఖ్యమైన స్పెసిఫికేషన్లు వెల్లడయ్యాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. వన్‌ప్లస్ 13 మినీ 6.3-అంగుళాల OLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇది LTPO టెక్నాలజీ,  1.5K రిజల్యూషన్‌ సపోర్ట్‌తో వస్తుంది. నాలుగు వైపులా ఇరుకైన బెజెల్‌లను కలిగి ఉంటుంది

కెమెరాల పరంగా, ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 50-మెగాపిక్సెల్ సోనీ IMX906 ప్రైమరీ కెమెరా + 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్‌తో 50-మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాను కలిగి ఉండవచ్చు. వన్‌ప్లస్ 13 మినీ మోడల్ ఆప్టికల్ ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

చిప్‌సెట్ విషయానికొస్తే వన్‌ప్లస్ 13 మినీ మోడల్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇందులో Oppo Find X8 Mini మోడల్ స్నాప్‌డ్రాగన్ 9400 చిప్‌ను కలిగి ఉంటుంది. ఇంటర్నెట్‌లోని సమాచారం ప్రకారం వన్‌ప్లస్ 13 మినీ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. కానీ బ్యాటరీ కెపాసిటీ గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.

వన్‌ప్లస్ 13 మినీ స్మార్ట్‌ఫోన్ 2025 రెండవ త్రైమాసికంలో చైనాలో మార్కెట్లోకి రావచ్చు. అంటే 2025 ఏప్రిల్-జూన్ మధ్య దీన్ని ప్రవేశపెట్టవచ్చు. ప్రస్తుతానికి ఈ స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ లాంచ్ గురించి స్పష్టమైన సమాచారం లేదు. అంటే ఇండియాలో లాంచ్ అవుతుందా లేక చైనాకు మాత్రమే ప్రత్యేకం అవుతుందా అనేది క్లారిటీ లేదు.

ఇటీవల విడుదల చేసిన వన్‌ప్లపస్ 13ఆర్ స్మార్ట్‌ఫోన్ ఇండియా ధర 2 స్టోరేజ్ ఆప్షన్‌లలో 12GB RAM + 256GB స్టోరేజ్ ఆప్షన్ ధర రూ. 42,999,  16GB RAM + 512GB స్టోరేజ్ ఆప్షన్ ధర రూ. 49,999. ఇది రెండు కలర్ ఆప్షన్స్‌లో ఆస్ట్రల్ ట్రైల్, నెబ్యులా నోయిర్‌ కలర్స్‌లో వస్తుంది.

వన్‌ప్లస్ 13 5జీ 12GB RAM + 256GB వేరియంట్ ధర రూ. 69,999, 16GB RAM + 512GB వేరియంట్ ధర రూ. 76,999. హై-ఎండ్ 24GB RAM + 1TB ఎంపిక ధర రూ. 89,999. ఇవి కొత్త స్మార్ట్‌ఫోన్‌లు అయినప్పటికీ, ఆఫర్‌లు OnePlus 13, OnePlus 13R మోడళ్లపై మాత్రమే అందుబాటులో ఉన్నాయని కూడా ఇక్కడ గమనించాలి.

Exit mobile version