OnePlus 13 R Launch Date: న్యూ ఇయర్ వేళ.. వన్‌ప్లస్ నుంచి ప్రీమియం ఫోన్.. ఎలా సాధ్యం సామీ..!

OnePlus 13 R Launch Date: స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ 13ఆర్ లాంచ్ తేదీని  ధృవీకరించింది. OnePlus 13R ఫోన్ జనవరి 7, 2025న భారతదేశంలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ వన్‌ప్లస్ 13 టోన్డ్-డౌన్ వెర్షన్. కానీ వన్‌ప్లస్ 13ఆర్ వన్‌ప్లస్ 13 కంటే పవర్‌‌ఫుల్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ అమ్లోడ్ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ ప్రాసెసర్, హై క్వాలిటీ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఈ మొబైల్ మార్కెట్లలోకి రాకముందే దాని ఫీచర్లు లీక్ అయ్యాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

OnePlus 13R Features
వన్‌ప్లస్ 13ఆర్ స్మార్ట్‌ఫోన్ ఫ్లాట్ ఎడ్జెస్, ఫ్లాట్ డిస్‌ప్లేతో వస్తుందని లీకైన ఫోటోలు ద్వారా తెలుస్తుంది. మొబైల్ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లో ఉండే ప్రీమియం ఫీచర్ అయిన సిరామిక్ బాడీని కలిగి ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. దీని కారణంగా ఫోన్ ప్రీమియం అనుభవాన్ని పొందుతుంది.

వన్‌ప్లస్ 13ఆర్ డిస్‌ప్లే విషయానికి వస్తే 1.5K రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల LTPO OLED ప్యానెల్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఫోన్ ఫుల్ హెచ్‌డి, క్వాడ్ హెచ్‌డి రిజల్యూషన్‌ను కలిగి ఉంది. ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇది స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్‌సెట్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. 12GB+ 16GB, 256GB నుండి 1TB UFS 4.0 స్టోరేజ్ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో వస్తుందని భావిస్తున్నారు.

వన్‌ప్లస్ 13ఆర్ వెనుక ట్రిపుల్-కెమెరా సెటప్ ఉంటుందని తెలుస్తుంది. మెయిన్ సెన్సార్ షార్ప్, స్టాండర్డ్ షాట్‌ల కోసం ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50-మెగాపిక్సెల్ యూనిట్‌గా ఉంటుందని భావిస్తున్నారు. ఇది 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్, అదనపు 2-మెగాపిక్సెల్ సెన్సార్‌తో కలిసి ఉండవచ్చు. ఈ వన్‌ప్లస్ మొబైల్  6,500mAh బ్యాటరీని కలిగి ఉంటుందని లీక్స్ ఉన్నాయి. ఈ పెద్ద బ్యాటరీ 80W వైర్డు ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుందని అంచనా.  దీని ద్వారా తక్కువ టైమ్‌లో బ్యాటరీని ఛార్జ్ చేయచ్చు.

OnePlus 13 Price
ఈ మొబైల్ లాంచ్ విషయానికి వస్తే  OnePlus 13R భారతదేశంలో 2025 జనవరి నెలలో మార్కెట్లోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దీని ధర సుమారు రూ. 45,000. రూ. 39,999తో ప్రారంభమైన OnePlus 12Rతో పోలిస్తే ఇది స్వల్ప పెరుగుదల. మిడ్ రేంజ్‌లో ప్రీమియం ఫీచర్లను పొందే వినియోగదారులకు OnePlus 13R మంచి ఎంపికగా మారనుంది.