OnePlus 13 Mini: ఈ సంవత్సరం ప్రారంభంలో వన్‌ప్లస్ దాని కొత్త OnePlus 13 సిరీస్‌ను ప్రారంభించింది, ఇందులో ఫ్లాగ్‌షిప్ OnePlus 13, మిడ్ రేంజ్ OnePlus 13R స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు కంపెనీ ఇప్పుడు ఈ సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 13 మినీని విడుదల చేయబోతున్నట్లు పేర్కొంది. కొత్త లీక్స్‌లో ఫోన్ డిజైన్, ధరతో సహా ఫోన్ కొన్ని ఫీచర్లు కూడా వెల్లడయ్యాయి. అయితే ఫోన్ లాంచ్ తేదీకి సంబంధించి ఇంకా సమాచారం లేదు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
OnePlus 13 Mini Features
ఈ మొబైల్ ఇప్పటి వరకు అత్యంత కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ కావచ్చు. ఈ ఫోన్ శక్తివంతమైన చిప్‌సెట్, సుదీర్ఘమైన బ్యాటరీ లైఫ్‌తో రావచ్చని భావిస్తున్నారు. వన్‌ప్లస్ 13 మినీ మే లేదా క్యూ2 2025లో మార్కెట్లోకి వస్తుందని చెబుతున్నారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఇది అత్యంత సరసమైన స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ఎలైట్-పవర్డ్ స్మార్ట్‌ఫోన్ కావచ్చు. ఇది కాకుండా 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.31-అంగుళాల LTPO OLED ప్యానెల్ ఉంటుందని సమాచారం.
కెమెరా గురించి మాట్లాడితే ఈ ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో డ్యూయల్ కెమెరా సెటప్, 2x ఆప్టికల్ జూమ్‌తో 50-మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. స్టాండర్డ్ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్‌కు బదులుగా, ఈసారి మనం బార్-ఆకారపు కెమెరా మాడ్యూల్‌ను చూడచ్చు. ఇందులో 6,000mAh బ్యాటరీ ఉంటుంది.
OnePlus 13 Mini Price
లేటెస్ట్ సమాచారం ప్రకారం.. వన్‌ప్లస్ 13 మినీ అత్యంత సరసమైన స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ఎలైట్ ఫోన్‌గా భావిస్తున్నారు. దీని ధర CNY 3,099 అంటే సుమారు రూ. 37,000 కంటే తక్కువగా ఉండవచ్చని ఇది చూపిస్తుంది. అయితే ఈ డివైజ్‌ని గ్లోబల్ మార్కెట్‌లో మాత్రమే పరిచయం చేయవచ్చని కూడా చెబుతున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలోకి వస్తుందా లేదా అనేది చూడాలి..!