Site icon Prime9

Moto Edge 60 Ultra: మోటో కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్.. మైమరిపిస్తున్న ఫీచర్లు.. లాంచ్ ఎప్పుడో తెలుసా?

Moto Edge 60 Ultra

Moto Edge 60 Ultra

Moto Edge 60 Ultra: టెక్ దిగ్గజ కంపెనీ మోటరోలా స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్‌తో Edge 50 Ultraని విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్‌లో క్వాడ్-కెమెరా సెటప్, 144Hz OLED డిస్‌ప్లేతో సహా అనేక ఇతర శక్తివంతమైన ఫీచర్లు ఉన్నాయి. ఎడ్జ్ 50 అల్ట్రా మెరుగైన బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది.  దీంతో బ్రాండ్ తదుపరి ఫ్లాగ్‌షిప్ అంటే ఎడ్జ్ 60 అల్ట్రాకు అప్‌గ్రేడ్ చేయడంపై అందరి దృష్టి పెట్టింది.

మోటరోలా ఎడ్జ్ సిరీస్ దాని నిర్దిష్ట డిజైన్‌కు ప్రసిద్ధి చెందింది. కాబట్టి ఎడ్జ్ 60 అల్ట్రా కూడా ఇదే డిజైన్‌లో వస్తుందని భావిస్తున్నారు. ఎడ్జ్ 50 అల్ట్రా వెనుకవైపు ప్రత్యేకమైన డిజైన్‌ ఉంటుంది. ఇది రియల్ ఉడ్, వేగన్ లెదర్ వలె కనిపిస్తుంది. ఇది భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఇది ట్రెండీగా ఉండే అవకాశం ఉంది.

మోటరోలా ఫ్లాగ్‌షిప్ డిస్‌ప్లేలు అగ్రశ్రేణిలో ఉంటాయి. ఎడ్జ్ 50 అల్ట్రా 6.7 అంగుళాల 1.5కే ఓఎల్‌డీ స్క్రీన్, 144 హెచ్‌జడ్ రీఫ్రెష్‌రేట్ కలిగి ఉంది. దీనికి గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటక్షన్ ఉంటుంది. ఫోన్ చాలా స్లిమ్‌గా తక్కువ బరువు ఉంటుంది. ప్రస్తుతం ఉన్న 2500 నిట్‌ల కంటే ఎక్కువ బ్రైట్‌నెస్‌తో ఎడ్జ్ 60 అల్ట్రా హై క్వాలిటీ విజువల్స్ అందిస్తుంది.

ఎడ్జ్ 50 అల్ట్రా కెమెరా సెటప్ గురించి మాట్లాడితే ఇది క్వాడ్ లెన్స్ కాన్ఫిగరేషన్‌తో లాంచ్ అయింది. ఎడ్జ్ 60 అల్ట్రా కోసం మోటరోలా ఇప్పటికే ఉన్న సెటప్‌ను అప్‌గ్రేడ్ చేసే అవకాశం ఉంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ లెన్స్, 64MP టెలిఫోటో కెమెరా ఉంటాయి. ఫ్రంట్ కెమెరా 50MP రిజల్యూషన్‌ను కూడా కలిగి ఉండవచ్చు.

ఎడ్జ్ 50 అల్ట్రా ఫోటో క్లారిటీ, కలర్, హెచ్‌డిఆర్ పనితీరులో అద్భుతంగా ఉంది. కానీ వీడియో క్వాలిటీ కొంచెం తక్కువగా ఉంది. మోటరోలా మెరుగైన కెమెరా ఫీచర్‌ల కోసం AI, సాఫ్ట్‌వేర్ ఆప్టిమైజేషన్‌లను కూడా పెంచాలి. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎస్ జనరేషన్ 3 ద్వారా రన్ అవుతుంది. ఎడ్జ్ 60 అల్ట్రా మరింత శక్తివంతమైన ప్రాసెసర్‌‌తో వస్తుంది.

ర్యామ్, స్టోరేజ్ పరంగా ఎడ్జ్ 60 అల్ట్రా 12GB RAM + 512GB స్టోరేజ్‌తో దాని పాత మోడల్ మాదిరిగానే ఉంటుంది. మోటరోలా 1TB వేరియంట్ కోసం 16GB RAM ఉంటుంది.  ఎడ్జ్ 60 అల్ట్రా ఆండ్రాయిడ్ 15 అవుట్ ఆఫ్ ది బాక్స్‌లో రన్ అవుతుందని అంచనా. అలానే ఇది స్టాక్ ఆండ్రాయిడ్ అనుభవాన్ని అందిస్తుంది.

మోటరోలా ప్రతి ఏడాది ఏప్రిల్‌లో కొత్త మోడళ్లను పరిచయం చేస్తుంది. ఎడ్జ్ 50 అల్ట్రా కూడా ఏప్రిల్ 16న విడుదలైంది. మే ప్రారంభంలో సేల్‌కి వచ్చింది. ఎడ్జ్ 60 అల్ట్రా కూడా అదే టైమ్‌లైన్‌‌లో ఉంటుందని భావిస్తున్నారు. Edge 50 Ultra ధర 512GB మోడల్‌కు €999 ($1,080).  Edge 60 Ultra ధర కూడా అదే స్థాయిలో ఉండే అవకాశం ఉంది.

Exit mobile version