Site icon Prime9

Motorola Razr 50 Ultra: ఆఫర్ అంటే ఇదీ.. మడతపెట్టే ఫోన్‌పై రూ.10 వేల డిస్కౌంట్.. ఇటువంటి డీల్ మళ్లీ రాదు..!

Motorola Razr 50 Ultra

Motorola Razr 50 Ultra

Motorola Razr 50 Ultra: మోటరోలా తన కస్టమర్లకు శుభవార్త అందించింది. ఇటీవల విడుదల చేసిన ఫోల్డబుల్ ఫోన్ ధరను తగ్గించారు. కంపెనీ ఈ ఏడాది జూలైలో Motorola Razr 50 Ultra ఫోన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఫోన్ ధర రూ.10,000 తగ్గింది. మీరు కొత్త ఫ్లిప్ ఫోన్ కొనాలని చూస్తున్నట్లయితే ఇది గొప్ప ఎంపిక. ధర తగ్గింపుతో పాటు బ్యాంక్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్, నో కాస్ట్ EMI కూడా అందుబాటులో ఉన్నాయి.

ఈ మోటరోలా స్మార్ట్‌ఫోన్ Samsung Galaxy Z Flip 6కి గట్టి పోటీనిచ్చింది. ఇది క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. Motorola Razr 50 Ultra స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఫోన్ 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 32-మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. ఇందులో 6.9 అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఇందులో 4000mAh బ్యాటరీ కూడా ఉంది.

Motorola Razr 50 Ultra Offers
కంపెనీ Motorola Razr 50 Ultra ఫోన్‌ను రూ. 89,999కి విడుదల చేసింది. ప్రస్తుతం దీనిపై రూ. 10,000 డిస్కౌంట్ ప్రకటించింది. ఇప్పుడు రూ. 79,999కి కొనుగోలు చేయచ్చు. అలానే రూ. 1,500 వరకు తగ్గింపు లభిస్తుంది. కంపెనీ 3 నుండి 18 నెలల నో కాస్ట్ EMI ఎంపికను అందిస్తోంది.

రూ. 25,700 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ పొందవచ్చు ఈ మొబైల్ పీచ్ ఫడ్జ్, స్ప్రింగ్ గ్రీన్, మిడ్‌నైట్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. మీరు ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్ అమెజాన్, కంపెనీ వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ స్టోర్‌ల నుండి Motorola Razr 50 అల్ట్రా ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

Motorola Razr 50 Ultra Features
అల్ట్రా మొబైల్ 6.9-అంగుళాల ఫుల్ HD ప్లస్ పోలరైజ్డ్ LTPO మెయిన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 165Hz రిఫ్రెష్ రేట్, 2640×1080 పిక్సెల్ రిజల్యూషన్ కలిగి ఉంది. ఈ ఫోన్ 4 అంగుళాల పోలరైజ్డ్ LTPO కవర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 165Hz రిఫ్రెష్ రేట్, 1272×1080 పిక్సెల్ రిజల్యూషన్‌కు సపోర్ట్ ఇస్తుంది. డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ద్వారా ప్రొటక్ట్ ఇస్తుంది.

ప్రాసెసర్  విషయానికి వస్తే ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్‌తో మోటరోలా Razr 50 అల్ట్రా ఫోన్‌ను కంపెనీ విడుదల చేసింది. ఇది గ్రాఫిక్స్ కోసం Adreno 735 GPUని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా హలో UI పై రన్ అవుతుంది. ఫోన్ 12 జీబీ ర్యామ్+ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది.

స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. ఇది OISతో 50 మెగాపిక్సెల్ 2x సెకండరీ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది. పవర్ కోసం 4000mAh కెపాసిటీ గల బ్యాటరీని ప్యాక్ చేసింది. బ్యాటరీని ఛార్జ్ చేయడానికి, 45W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ అందించారు.

ఇతర ఫీచర్లు ఫీచర్ల విషయానికి వస్తే అల్ట్రా ఫోన్‌లో స్టీరియో స్పీకర్లు, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మాస్,  IPX8 రేటింగ్ ఉన్నాయి. ఇది డ్యూయల్ సిమ్ 5G, 4G VoLTE, Wi-Fi 6E, బ్లూటూత్ 5.3 వంటి అనేక కనెక్టివిటీ ఫీచర్లను కూడా కలిగి ఉంది.

Exit mobile version