Prime9

Motorola Edge 60 5G: బ్లాక్ బస్టర్ బొమ్మ.. మోటరోలా ఎడ్జ్ 60 5G వచ్చేస్తోంది.. డబ్బులు దాచుకో..!

Motorola Edge 60 5G: మోటరోలా ఇప్పటివరకు తన ఎడ్జ్ ’60’ సిరీస్ కింద ఎడ్జ్ 60 స్టైలస్, ఎడ్జ్ 60 ఫ్యూజన్, ఎడ్జ్ 60 ప్రో స్మార్ట్‌ఫోన్‌లను భారతదేశంలో విడుదల చేసింది. ఇప్పుడు కంపెనీ ఈ సిరీస్‌లోని నాల్గవ మోడల్ మోటరోలా ఎడ్జ్ 60ని తీసుకువస్తోంది. జూన్ 10న భారతదేశంలో ఎడ్జ్ 60 5G ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు మోటరోలా ప్రకటించింది. ఈ మొబైల్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లను కూడా కంపెనీ విడుదల చేసింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

 

Motorola Edge 60 5G Launch Date
కంపెనీ తన అధికారిక వెబ్‌సైట్‌లో Motorola Edge 60 5G ఫోన్‌ను ప్రత్యక్ష ప్రసారం చేసింది. దీని ద్వారా అన్ని వివరాలు వెల్లడయ్యాయి. ఇప్పుడు మోటరోలా ఎడ్జ్ 60 ధర మాత్రమే రావాల్సి ఉంది, ఇది జూన్ 10న తెలుస్తుంది. ధరతో పాటు, ఫోన్ సేల్ వివరాలు, దానిపై అందుబాటులో ఉన్న ఆఫర్‌ల గురించి సమాచారం అందించారు. ఈ మోటరోలా 5G ఫోన్ కంపెనీ వెబ్‌సైట్, షాపింగ్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో కూడా అమ్మకానికి ఉండటం గమనించదగ్గ విషయం.

 

Motorola Edge 60 5G Features
మోటరోలా ఎడ్జ్ 60 5G ఫోన్ 2712 x 1220 పిక్సెల్ రిజల్యూషన్‌, 6.7-అంగుళాల 1.5K డిస్‌ప్లేతో విడుదలైంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇచ్చే POLED ప్యానెల్‌పై నిర్మించారు. ఈ మొబైల్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ టెక్నాలజీతో ఉంది. అలానే ఫోటోగ్రఫీ కోసం ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ అందించారు. ఇందులో 50-మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 50-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్, 10-మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 50-మెగాపిక్సెల్ హై-రిజల్యూషన్ కెమెరా ఉంది.

 

ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌పై పనిచేస్తుంది, ఇది 5G కనెక్టివిటీకి సపోర్ట్ ఇస్తుంది. ఈ చిప్‌సెట్ 2.0GHz నుండి 2.6GHz క్లాక్ వేగంతో పనిచేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. గ్రాఫిక్స్ కోసం, ఈ ఫోన్‌లో ఆర్మ్ మాలి-జి615 ఎంసి2 జిపియు ఉంది. పవర్ బ్యాకప్ కోసం బలమైన 5500mAh బ్యాటరీ ఉంది. ఇది 68W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

 

దీనితో, ఫోన్‌ను తక్కువ సమయంలో వేగంగా ఛార్జ్ చేయవచ్చు,ఎక్కువ సమయం బ్యాకప్ కూడా అందుబాటులో ఉంటుంది. ఫోన్‌లో USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్‌తో పాటు టైప్-C ఆడియో జాక్ కూడా ఉంది. దీని బాడీ డిజైన్ ‘ఎయిర్ నానోస్కిన్’ మెటీరియల్‌తో తయారు చేశారు. దీని బరువు దాదాపు 181 గ్రాములు. ఇది బ్లూస్ సోడా కలర్ వేరియంట్‌లో అందుబాటులో ఉంది.

 

Motorola Edge 60 5G Price
భారతదేశంలో మోటరోలా ఎడ్జ్ 60 ధర ఎడ్జ్ 60 ఫ్యూజన్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఎడ్జ్ 60 ఫ్యూజన్ ప్రారంభ ధర రూ.22,999. కంపెనీ రూ.24,999 కు ఎడ్జ్ 60 5G ఫోన్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. మోటరోలా ఎడ్జ్ 60 భారతదేశంలో పాంటోన్ షామ్రా, పాంటోన్ జిబ్రాల్టర్ సీ రంగుల్లో లభిస్తుంది. అయితే, ఫోన్ అసల ధర కోసం జూన్ 10 వరకు వేచి ఉండాలి.

Exit mobile version
Skip to toolbar