Site icon Prime9

Moto E32 Smart Phone : మోటో విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ వివరాలు ఇవే !

moto e 32 prime9news

moto e 32 prime9news

Moto E32 Smart Phone : బడ్జెట్ లో స్మార్ట్‌ఫోన్‌ కొనాలనుకునే వారి కోసం మోటోరోలా స్మార్ట్ ఫోన్ మన ముందుకు రానుంది.మోటో E32 స్మార్ట్‌ఫోన్‌ ఇండియాలో లాంచ్ అయింది. మీడియాటెక్ హీలియో జీ37 4G ప్రాసెసర్‌తో ఈ స్మార్ట్ ఫోన్ మన ముందుకు వస్తోంది.క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీ ఉన్న రెండు కెమెరాలు ఈ ఫోన్‌ వెనుక ఉన్నాయి.Moto E32 స్మార్ట్‌ఫోన్‌ ధర వివరాలు, స్పెసిఫికేషన్లు గురించి ఇక్కడ తెలుసుకుందాం.

Moto E32 స్పెసిఫికేషన్లు ఈ విధంగా ఉన్నాయి.
90Hz రిఫ్రెష్ రేట్ ఉండే 6.5 ఇంచుల ఫుల్ HD+ IPS LCD display మోటో E32 వస్తోంది.ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో G37 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్‌ రన్ అవుతుంది.ఆండ్రాయిడ్‌ 12 బేస్డ్ ux,UI తో మన ముందుకు వస్తోంది.రెండు సంవత్సరాల os అప్‌డేట్స్ ఈ ఫోన్‌ను ఇవ్వనున్నట్టు మోటోరోలా సంస్థ వారు పేర్కొన్నారు.ఈ స్మార్ట్ ఫోన్‌లో మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా ఉంటుంది.

Moto E32 ధర ఈ విధంగా ఉంది
మోటో E32 ఒకే వేరియంట్‌లో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది.4gb ర్యామ్ + 64gb స్టోరేజ్ ఉన్న ఈ స్మార్ట్ ఫోన్‌ ధర రూ.10,499 గా ఉంది.ఈ స్మార్ట్ ఫోన్ కాస్మిక్ బ్లాక్, ఐస్‌బర్గ్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో ఈ స్మార్ట్ ఫోన్ రానుంది.ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పటికే ఈ స్మార్ట్ ఫోన్‌ సేల్‌ మొదలైంది.

Exit mobile version