Site icon Prime9

Money from Twitter: ఇకపై ట్విటర్ ద్వారా సంపాదించుకోవచ్చు

elon musk tweets readability changes

elon musk tweets readability changes

Money from Twitter: ఎలాన్ మస్క్ ట్విటర్ ను కొనుగోలు చేసిన మార్పులకు అందులో మార్పులకు కొదవ లేదు. ఉద్యోగుల తీసివేతల దగ్గర నుంచి ట్విటర్ లోగోను మార్చే దాకా ప్రతీది సంచలనాత్మక నిర్ణయాలే. తాజాగా ట్విటర్ యూజర్లు తమ కంటెంట్‌ నుంచి డబ్బు సంపాదించుకునేందుకు పర్మిషన్ ఇచ్చాడు ఎలాన్ మస్క్. సుదీర్ఘ సమాచారం నుంచి ఎక్కువ నిడివి గల వీడియోల వరకు దేనికైనా సబ్‌స్క్రిప్షన్‌ ఆప్షన్‌ను పెట్టుకోవడం ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చని మస్క్ వెల్లడించారు. అందుకోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లి మానిటైజ్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తే సరిపోతుందని తెలిపారు. ప్రస్తుతానికి ఈ ఆప్షన్‌ అమెరికాలో మాత్రమే ఉందన్నారు. త్వరలో ఇతర దేశాలకూ విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు.

12 నెలల పాటు రుసుము లేకుండా(Money from Twitter)

అదే విధంగా.. తమ కంటెంట్‌ ద్వారా యూజర్లు సంపాదించిన డబ్బు నుంచి రానున్న 12 నెలల పాటు ట్విటర్‌ ఎలాంటి రుసుములు తీసుకోదని మస్క్‌ వెల్లడించారు. అంటే సబ్‌స్క్రిప్షన్ల ద్వారా వచ్చిన డబ్బులో 70 శాతం వరకు యూజర్లకే వస్తుందన్నారు. ట్విటర్‌ ద్వారా ఆర్జిస్తున్న మొత్తం నుంచి ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ 30 శాతం యాప్‌స్టోర్‌ ఫీజు కింద వసూలు చేస్తోంది. వెబ్‌లో అయితే 92 శాతం వరకు ఆదాయం యూజర్లకే చెందుతుందని మస్క్ స్పష్టం చేశారు. అలాగే కంటెంట్‌ను ప్రమోట్‌ చేసుకునేలా ట్విటర్‌ సహకరిస్తుందని తెలిపారు. ఒకవేళ యూజర్లు కావాలనుకుంటే ఎప్పుడైనా తమ కంటెంట్‌తో సహా ట్విటర్‌ నుంచి బయటకు వెళ్లొచ్చని స్పష్టం చేశారు.

 

 

ట్విటర్ లో తాజాగా తెచ్చిన మార్పుల వల్ల మరింత మంది ఎక్కువ కంటెంట్ క్రియేటర్లను ట్విటర్ మీదకు తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నట్టు  తెలుస్తోంది. ఈ నిర్ణయంతో ఉన్న కంటెంట్ క్రియేటర్లను పొగొట్టుకోకుండా ఉండేందుకు వ్యూహం అయి ఉండొచ్చని నిపుణలు అభిప్రాయపడుతున్నారు. మొదటి 12 నెలల పాటు ఎలాంటి రుసుము తీసుకోకపోయినా.. భవిష్యత్‌తో మాత్రం మంచి ఆదాయ వనరుగా మారే అవకాశం ఉందని అంచనా.

 

Exit mobile version