Site icon Prime9

Microsoft: ఉద్యోగులకు మరో షాక్ ఇచ్చిన మైక్రో సాఫ్ట్

microsoft

microsoft

Microsoft: ఆర్థిక మాంద్యం ముప్పుతో ఇప్పటికే వేలమంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిక టెక్ దిగ్గజం మైక్రో సాఫ్ట్ తాజా మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ ఏడాది ఫుల్ టైం శాశ్వతం ఉద్యోగులకు వేతనాల పెంపులు లేవని తెలిపినట్టు తెలుస్తోంది. ఈ మేరకు సంస్థ సీఈఓ సత్య నాదెళ్ల ఉద్యోగులకు లేఖ రాసినట్టు సమాచారం. ఖర్చులను తగ్గించుకునే భాగంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు నాదేళ్ల ఈ లేఖలో పేర్కొన్నారు.

 

ఉద్యోగుల అసంతృప్తి(Microsoft)

గత ఏడాది మార్కెట్ పరిస్థితులు, కంపెనీ పనితీరుకు అనుగుణంగా పరిహారం చెల్లించడానికి గణనీయంగా పెట్టుబడి పెట్టాం. అయితే ఈ ఏడాది పరిహారాల కోసం పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయించలేకపోతున్నామని నాదెళ్ల తెలిపినట్టు సమాచారం. ఈ క్రమంలోనే జీతాల పెంపును నిలిపివేయడంతో పాటు బోనస్ లు, స్టాక్ అవార్డులకు తక్కువ నిధులు కేటాయించినట్టు ఉద్యోగులకు తెలియజేశారని ఇన్ సైడర్ పత్రిక తెలిపింది.

 

అయితే కంపెనీ తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జీతాల పెంపు లేకపోవడం ఉద్యోగులకు ఎదురుదెబ్బ అని సోషల్ మీడియా లో ఓ ఎంప్లాయ్ పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఫోస్ట్ వైరల్‌గా మారింది. కాగా, గత జనవరిలో మైక్రోసాఫ్ట్ 10 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపింది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక ముప్పును తప్పించుకునేందుకు లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. ప్రస్తుతం ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ పై మెక్రోసాఫ్ట్ పెట్టుబడులు కొనసాగుతున్నాయి. టెక్నాలజీ రంగంలో పోటీ తత్వం మరింత పెరింగిందని టెక్ నిపుణులు చెబుతున్నారు.

 

 

Exit mobile version