Threads App: ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌కు పోటీగా మెటా సరికొత్త యాప్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. థ్రెడ్స్ యాప్ పేరుతో తీసుకొచ్చిన ఈ టెక్ట్స్ ఆధారిత యాప్ వర్సెన్ ను గురువారం ఐవోఎస్, ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది మెటా. ఈ యాప్‌ను ప్రారంభించిన తొలి రెండు గంటల్లోనే రెండు మిలియన్ల మంది, నాలుగు గంటల్లో ఐదు మిలియన్ల మంది, ఆ తరువాత కొద్ది గంటలకే ఏడు మిలియన్ల మంది డౌన్‌లోడ్స్ చేసుకున్నట్టు మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు. దీనిలో ఫీచర్స్ కూడా ట్విటర్కు సమానంగా ఉంటాయని మెటా వెల్లడించింది. ఇన్ స్టాగ్రామ్ లోని చాలా ఫీచర్లను ఇందులో అందుబాటులోకి తీసుకువచ్చారు.
మరి ఈ యాప్‌లో ఏఏ ఫీచర్స్ ఉన్నాయో తెలుసుకుందాం(Threads App).
థ్రెడ్స్ యాప్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లలో యాప్ స్టోర్, ప్లే స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది. యూజర్లు డెస్క్‌టాప్‌సైట్ నుంచి కూడా థ్రెడ్స్‌ను వినియోగించవచ్చు.
థ్రెడ్స్ యాప్‌లో వినియోగదారులు గరిష్టంగా 500 అక్షరాలతో ఒక ఫోస్ట్ చేయొచ్చు.
థ్రెడ్స్ యాప్‌లో ఫొటోలు, వీడియోల విషయానికి వస్తే.. ట్విటర్‌లో మాదిరిగానే మీ ఖాతా నుంచి ఫొటోలను పంచుకోవచ్చు. ఐదు నిమిషాల నిడివి ఉన్న వీడియోలను పోస్టు చేయొచ్చు.
ఇన్ స్టాగ్రామ్‌లో అకౌంట్ ఉంటే థ్రెడ్స్ యాప్ కోసం మీరు ప్రత్యేకంగా ఖాతా తెరవాల్సిన అవసరం లేదు. థ్రెడ్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా లాగిన్ అవ్వొచ్చు. యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే లాగిన్ అవ్వడానికి మీ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ను ఆటోమెటిక్‌గా చూపుతుంది. మీరు మీ ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ను లాగిన్ అయ్యి ఉంటే పాస్‌వర్డ్ అవసరం లేదు.
థ్రెడ్స్ యాప్ లాగిన్ అయిన తరువాత ఫాలోవర్స్ ను ఎలా ఎంచుకోవాలని అనే ప్రశ్న అవసరం లేదు.. లాగిన్ అయిన తరువాత మీ ఇన్ స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్న వ్యక్తుల మొత్తం జాబితాను యాప్‌లో చూపిస్తుంది. మీ ఎంపిక ఆధారంగా ఒకటి, కొన్ని, అందరిని ఫాలో కావొచ్చు. అంతేకాక, మీ ప్రొఫైల్‌ను పబ్లిక్‌గా, ప్రైవేట్‌గా ఉంచే అవకాశమూ ఉంటుంది.
థ్రెడ్స్‌లో ప్రకటనల కనిపిస్తాయా? అనే విషయానికి వస్తే.. ప్రస్తుతానికి థ్రెడ్స్ అనేది యాడ్ -ఫ్రీ యాప్. అయితే, యాప్‌లో త్వరలో మార్పులు చేసే అవకాశం ఉంది. అప్పటి వరకు వినియోగదారులకు ప్రకటనలు కనిపించవు.
థ్రెడ్స్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ ఫీచర్స్‌ను పోలి ఉంటాయి. అదేవిధంగా ట్విటర్‌లో ఉన్న దాదాపు అన్ని ఫీచర్లను కలిగి ఉంటుంది.