Mahindra Thar SUV: కార్ల ప్రియులకు మహీంద్రా గుడ్ న్యూస్ చెప్పింది. మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి మరో కార్ లేటెస్ట్ వెర్షన్ లో రాబోతుంది. ఈ ఆటోమెుబైల్ నుంచి 5 డోర్ల థార్ ఎస్ యూవీ అందుబాటులోకి రానుంది. ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి అద్భుతమైన ఫీచర్లతో మరికొద్ది నెలల్లో ఇది మార్కెట్లోకి అడుగుపెట్టనుంది.
ధర ఎంతంటే?
కార్ల ప్రియులకు మహీంద్రా గుడ్ న్యూస్ చెప్పింది. మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి మరో కార్ లెటేస్ట్ వెర్షన్ లో రాబోతుంది. ఈ ఆటోమెుబైల్ నుంచి 5 డోర్ల థార్ ఎస్ యూవీ అందుబాటులోకి రానుంది. ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటి అద్భుతమైన ఫీచర్లతో మరికొద్ది రోజుల్లో ఇది మార్కెట్లోకి అడుగుపెట్టనుంది.
ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ మహీంద్రా & మహీంద్రా 5-డోర్ల థార్‌ను వచ్చే ఏడాది అందుబాటులోకి రానుంది. మహీంద్రా Q4, FY23 ఆర్థిక ఫలితాల ప్రకటన సందర్భంగా, కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఆటో, ఫార్మ్ సెక్టార్) రాజేష్ జెజురికర్ మాట్లాడుతూ.. 5-డోర్ల థార్ 2023లో కాకుండా 2024లో లాంచ్ అవుతుందని వెల్లడించారు.
ఇప్పుడు 2024 మహీంద్రా థార్ 5-డోర్ SUV మోడల్‌కు సంబంధించి ఒక ఫొటో సోషల్ మీడియాలో షేర్ అయింది. ఆ ఫొటోలో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో మహీంద్రా థార్ SUV కారు కనిపించింది. ప్రస్తుతం భారత మార్కెట్లో విక్రయించే 3-డోర్ల థార్‌లో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ లేదు.
అంతేకాకుండా, 2024 మహీంద్రా థార్ 5-డోర్ కూడా 3-డోర్ థార్ మాదిరిగా కాకుండా, కన్వర్టిబుల్ టాప్, హార్డ్ టాప్ ఆప్షన్‌లతో హార్డ్ టాప్‌ని కలిగి ఉండొచ్చు.
స్టాండర్డ్‌గా ఈ ఏడాది ప్రారంభంలో, మహీంద్రా 3-డోర్ థార్ RWD వేరియంట్‌ను లాంచ్ చేసింది. SUV మోడల్ మొదట అక్టోబర్ 2020లో 4WD ప్రామాణికంగా ప్రవేశపెట్టారు.
2.2-లీటర్ డీజిల్, 2.0-లీటర్ పెట్రోల్ మిల్లులు 6-స్పీడ్ MT, 6-స్పీడ్ AT ఆప్షన్లను కలిగి ఉన్నాయి.
3-డోర్ థార్ ధర రూ. 10,54,500 నుంచి రూ. 16,77,501 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండగా.. 2024 మహీంద్రా థార్ 5-డోర్ ప్రీమియంతో రానుంది.
ఈ SUV కారు ధర రూ. 2 లక్షల వరకు ఉండవచ్చు.