Site icon Prime9

OnePlus New Mobiles: వన్‌ప్లస్ సంచలనం.. ఖతర్నాక్ ఫోన్లు వస్తున్నాయ్.. లాంచ్ ఎప్పుడంటే..!

OnePlus New Mobiles

OnePlus New Mobiles

OnePlus New Mobiles: వన్‌ప్లస్ శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌లతో భారతదేశంలోని చాలా మంది స్మార్ట్‌ఫోన్ ప్రియులను సంతృప్తిపరిచిన బ్రాండ్. ఇటీవల కంపెనీ తన ప్రీమియం స్మార్ట్‌ఫోన్ OnePlus 13 ను చైనాలో విడుదల చేసింది. త్వరలో భారత్‌లో కూడా లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. అయితే దీని తర్వాత వన్‌ప్లస్ చైనాలో OnePlus Ace 5,  Ace 5 Pro మోడల్‌లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు లీక్స్ వస్తున్నాయి.

OnePlus Ace 5 Pro సరికొత్త Snapdragon 8 Elite చిప్‌సెట్‌తో లాంచ్ అవుతుంది. ఈ చిప్‌సెట్‌తో కూడిన చౌకైన స్మార్ట్‌ఫోన్ మోడల్ ఇదేనని సమాచారం. కాబట్టి ఈ స్మార్ట్‌ఫోన్ ఇతర బ్రాండ్‌ల ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లకు కాంపిటీటివ్‌గా నిలిస్తుంది. అయితే వన్‌ప్లస్ ఈ ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేయదు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో మాత్రమే సేల్‌కి తీసుకొస్తుంది.

దీనితో విడుదల చేయనున్న OnePlus Ace 5 మోడల్ కూడా చైనాలో మాత్రమే విక్రయిస్తుంది. కానీ OnePlus 13R ఈ మోడల్‌ను గ్లోబ్లల్ మార్కెట్‌లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. భారత్ మార్కెట్‌లోకి కూడా సందడి చేయనుంది. OnePlus 13R లేదా OnePlus Ace5 అనేది సరసమైన ధరలో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ అనుభవం కోసం చూస్తున్న వారికి.

OnePlus Ace5 Pro బేస్ మోడల్ ధర దాదాపు 3,300 యువాన్లుగా ఉంటుందని DCS తెలిపింది. అదే సమయంలో భారతదేశంతో సహా మార్కెట్‌లకు చేరుకోనున్న OnePlus Ace 5 ఫీచర్లు లీక్ అయిన నివేదికలుగా బయటకు వచ్చాయి. DCS లీక్ ప్రకారం.. Ace 5 6.78-అంగుళాల ఫ్లాట్ 8T OLED ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. ఇది BOE X2 ప్యానెల్, 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడా వస్తుంది.

స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్‌సెట్ కాకుండా 16GB వరకు LPDDR5x RAM, 512GB వరకు UFS 4.0 స్టోరేజ్, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీ, ట్రిపుల్ రియర్ కెమెరా (50MP + 8MP + 8MP) ఉంటాయి. ఇది కూడా Ace 5 Pro వలె అదే కెమెరా కాన్ఫిగరేషన్‌గా ఉంటుంది. వన్‌ప్లస్ ఏస్ 5  5 సిరీస్ ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ మొదటి వారంలో చైనాలో లాంచ్ అవుతుంది. చైనాలో ప్రారంభించిన తర్వాత ఏస్ 5 మోడల్ OnePlus 13Rగా గ్లోబల్ రీబ్రాండింగ్‌ వెర్షన్‌గా రానుంది.

Exit mobile version