Site icon Prime9

Finger-Washing Machine: చేతి వేళ్ళను శుభ్రం చేసుకునే మిషన్ వచ్చేసింది!

hands cleaning machine prime9news

hands cleaning machine prime9news

Technology: మనలో చాలా మంది సాయంత్రం ఐతే చాలు ఏవో ఒకటి తింటూనే ఉంటారు. ఇప్పుడున్న వాళ్ళు ఐతే తిన్న తరువాత చేతులు కడగడానికి కూడా తెగ ఇబ్బంది పడుతుంటారు. అందరూ సాయంత్రం ఐతే పకోడీలు, భజ్జీలను తింటుంటారు. తినుకుంటూ టీవి చూడటం మనలో చాలా మంది చేస్తుంటారు. అలా చూస్తూ ఉండగా చేతి వేళ్ళను శుభ్రం చేసుకోకుండా అలానే ఉండిపోతారు. నూనె చేసిన వంటకాలను తిన్న తరువాత మన చేతి వేళ్ళకు నూనె అలాగే ఉండిపోతుంది.

మనకి పదే పదే చేతులను శుభ్రం చేసుకోవాలంటే చాలా చీరాకుగా అన్పించి, టిష్యూపేపర్‌తో శుభ్రం చేసుకుంటాము. మనం పడే ఇబ్బందులు చూడలేక అంతర్జాతీయ చిప్స్‌ సంస్థ ‘లేస్‌’  వారు ఒక పరికరాన్ని కనుగొన్నారు. ఇది చూడటానికి చాలా చిన్నగా ఉంటుంది. దీనిలో మన చేయి పట్టదు కానీ చేతి వేళ్ళను ఐతే శుభ్రం చేసుకోవచ్చు. ఈ పరికరం ఎత్తు 15 సెంటి మీటర్లు , వెడల్పు 11 సెంటి మీటర్లు. దీని లోపల మన చేతి వేళ్లు పెడితే చాలు, వెంటనే శుభ్రం అవుతాయి. చేతి వేళ్లు పెట్టిన వెంటనే పైభాగంలోని సెన్సర్లు వేళ్ళను గుర్తించి, సిలిండర్‌ నుంచి ఆల్కహాల్‌ను పంపించి మన చేతి వేళ్ళపై స్ప్రే చేస్తాయి. దీనిని మనం రోజు ఛార్జింగ్ పెట్టుకొని వాడుకోవాలి.

Exit mobile version