Lava Bold Series Launched: భారతీయ స్మార్ట్‌ఫోన్ కంపెనీ లావా తన కొత్త బోల్డ్ సిరీస్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్ కింద, కంపెనీ బోల్డ్ N1, బోల్డ్ N1 ప్రోలను చేర్చింది. ఈ సిరీస్‌లో కంపెనీ రూ.7,000 కంటే తక్కువ ధర గల ఫోన్‌లను ప్రవేశపెట్టింది. ఈ ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌లు ఖరీదైన ఫోన్‌ల వంటి ఫీచర్లతో వస్తాయి. ఈ ఫోన్‌లలో శక్తివంతమైన కెమెరా, బ్యాటరీతో పాటు బ్లోట్‌వేర్ రహిత ఆండ్రాయిడ్‌ను పొందుతారు. లావా బోల్డ్ N1, లావా బోల్డ్ N1 ప్రో ధరలు, ఫీచర్లు, ఆఫర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
Lava Bold N1 Pro, Lava Bold N1 4G Price
బోల్డ్ N1 ప్రో ధర ప్రత్యేక లాంచ్ ఆఫర్‌తో రూ.6,699. బోల్డ్ N1 ధర రూ.5,999. రెండు స్మార్ట్‌ఫోన్లు అమెజాన్ ఇండియాలో అమ్మకానికి అందుబాటులో ఉంటాయి. వీటిలో స్టైలిష్ డిజైన్, ఉచిత సేవ ఉన్నాయి. బోల్డ్ N1 ప్రో ఫోన్ టైటానియం గోల్డ్, స్టెల్త్ బ్లాక్ రంగులలో లభిస్తుంది. బోల్డ్ N1 4G ఫోన్ రేడియంట్ బ్లాక్, స్పార్కింగ్ ఐవరీ రంగుల్లో లభిస్తుంది.
Lava Bold N1 Pro Features
లావా బోల్డ్ N1 ప్రో అనేది 6.67-అంగుళాల HD+ పంచ్-హోల్ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చే ఎంట్రీ లెవల్ ఫోన్. ఈ ఫోన్ యూనిసాక్ T606 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 4GB + 4GB వర్చువల్ ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది, దీనిని 256GB వరకు విస్తరించవచ్చు. ఈ కెమెరా సెటప్‌లో 50MP AI ట్రిపుల్ రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా (స్క్రీన్ ఫ్లాష్‌తో) ఉన్నాయి, ఇది ఫోటోగ్రఫీ ప్రియులకు బెస్ట్. ఇది ఆండ్రాయిడ్ 14 పై పనిచేస్తుంది. 5000mAh బ్యాటరీతో వస్తుంది, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది (బాక్స్‌లో 10W ఛార్జర్). ఇతర ఫీచర్స్‌లో సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, IP54 డస్ట్ ,వాటర్ రెసిస్టెన్స్ ఉన్నాయి. బోల్డ్ N1 ప్రో యూజర్లు 1 ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్, 2 సెక్యూరిటీ అప్‌డేట్‌లను కూడా పొందుతారు.
Lava Bold N1 4G Features
బోల్డ్ N1 క్లీన్, సహజమైన పనితీరును కోరుకునే వినియోగదారుల కోసం రూపొందించారు. ఇందులో 6.75-అంగుళాల HD+ డిస్‌ప్లే ఉంది, ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. కెమెరా సెటప్‌లో 13MP AI డ్యూయల్ రియర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఫోన్ ఆండ్రాయిడ్ 14 గో ఎడిషన్‌పై నడుస్తుంది, ఇది బ్లోట్‌వేర్-రహిత ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది. ఇది UNISOC ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 4GB + 4GB వర్చువల్ ర్యామ్, 64GB స్టోరేజ్ ఉంది. ఈ ఫోన్‌లో 5000mAh బ్యాటరీని అందించారు. ఇది 10W టైప్-C ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, కాల్ రికార్డింగ్ వంటి ఫీచర్లతో వస్తుంది. IP54 రేటింగ్‌తో వాటర్, డస్ట్ ప్రూఫ్‌గా చేస్తుంది.