Lava Blaze Duo 5G Launch: లావా తన బ్లేజ్ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. అదే Lava Blaze Duo 5G స్మార్ట్‌ఫోన్. ఇది డ్యూయల్ డిస్‌ప్లేతో పాటు గొప్ప ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్ 6.67 అంగుళాల FHD+ 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. అలానే ఇది 1.58 అంగుళాల సెకండరీ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది, దీనికి కంపెనీ ఇన్‌స్టాస్క్రీన్ అని పేరు పెట్టింది.
సెకండరీ డిస్‌ప్లే (ఇన్‌స్టాస్క్రీన్) కాల్‌లను రిసీవ్ చేసుకోవడానికి, నోటిఫికేషన్‌లను చూడటానికి, వెనుక కెమెరాతో సెల్ఫీలు తీసుకోవడానికి, మ్యూజిక్ ప్లేయర్, స్టెప్-కేలరీ ట్రాకర్, వాయిస్ రికార్డర్, టైమర్, స్టాప్‌వాచ్, వాతావరణం వంటి యాప్‌లను ఆపరేట్ చేయడానికి ఉపయోగించవచ్చు.
Introducing Blaze Duo: Live The DUO Life!
Special Launch Price: ₹14,999*
Sale Starts on 20th Dec, 12 PM | Only on Amazon *Incl. Bank Offers #BlazeDuo #LiveTheDuoLife #LavaMobiles #ProudlyIndian pic.twitter.com/SCbiSMlSza
— Lava Mobiles (@LavaMobile) December 16, 2024
Lava Blaze Duo 5G Specifications
6nm ఆర్కిటెక్చర్ ఆధారంగా డిజైన్ చేసిన ఈ ఫోన్‌లో మెడిటెక్ డైమన్సిటీ 7025 చిప్‌సెట్ ఉపయోగించారు. దీనిలో 8GB వరకు RAM (8GB వర్చువల్ RAM), 128GB UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఫోన్ ఆండ్రాయిడ్ 14లో పని చేస్తుంది. త్వరలో ఆండ్రాయిడ్ 15 అప్‌డేట్ అందిస్తామని కంపెనీ వెల్లడించింది.
కెమెరా గురించి మాట్లాడితే.. Lava Blaze Duo 5G వెనుక భాగంలో సోనీ సెన్సార్‌తో 64MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ మాక్రో కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఉంది, దీని ద్వారా వినియోగదారులు అద్భుతమైన నాణ్యతతో ఫోటోలను క్లిక్ చేయవచ్చు. ఈ ఫోన్ పెద్ద 5000mAh బ్యాటరీతో వస్తుంది, ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.
ఇక చివరగా ఇతర ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ ఫోన్ IP64 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తుంది. కనెక్టివిటీ కోసం ఇందులో 5G SA/ NSA, Dual 4G VoLTE, Wi-Fi 6E, బ్లూటూత్ 5.4, USB టైప్-సి పోర్ట్ వంటి ఆప్షన్లు ఉన్నాయి.
Lava భారతదేశంలో Blaze Duo 5G స్మార్ట్‌ఫోన్‌ను రెండు వేరియంట్‌లలో విడుదల చేసింది. బేస్ 6GB + 128GB వేరియంట్ ధర రూ.16,999. దీని రెండవ వేరియంట్ 8GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్2తో వస్తుంది. దీని ధర రూ.17,999. ఈ ఫోన్ డిసెంబర్ 20, 2024 నుండి Amazon.inలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. లాంచ్ ఆఫర్ కింద, మీరు HDFC బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ ద్వారా డిసెంబరు 20 నుండి 22 వరకు చెల్లింపుపై రూ. 2000 తక్షణ తగ్గింపును పొందుతారు.