Site icon Prime9

Jio Diwali Offer: జియో భారీ ఆఫర్.. రూ.153కే అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా, ఓటీటీ!

Jio Diwali Offer

Jio Diwali Offer

Jio Diwali Offer: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో దీపావళి సందర్భంగా కోట్లాది మంది వినియోగదారులకు భారీ ఆఫర్‌ను అందించింది. పండుగ నేపథ్యంలో జియో తన కస్టమర్ల కోసం చౌకైన ప్లాన్‌తో ముందుకు వచ్చింది. ఇప్పుడు ఫ్రీ కాలింగ్, డేటా కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేదు. పండుగ సీజన్‌లో వినియోగదారుల ఇబ్బందులను తగ్గించేందుకు జియో అతి తక్కువ ధరకు ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

జియో రీఛార్జ్‌ల జాబితాలో అనేక రకాల ప్లాన్లు ఉన్నాయి. అందులో చౌకైనవి ఉన్నాయి,  ఖరీదైన కూడా అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా జియో తన వినియోగదారులకు షార్ట్‌టర్మ్ అండ్ లాంగ్‌టర్మ్‌లో డిఫరెంట్ బడ్జెట్ ప్లాన్‌లను అందిస్తుంది. జియో దీపావళి ఆఫర్‌తో కస్టమర్ల రీఛార్జ్ పెద్ద టెన్షన్‌ను తొలగించింది. కంపెనీ ఇప్పుడు 28 రోజుల చౌకైన ప్లాన్‌తో వచ్చేసింది.

జియో రీఛార్జ్‌ల జాబితాలో రూ. 153 అత్యంత పొదుపుగా ఉండే ప్లాన్ . కంపెనీ వినియోగదారులకు రూ.153కి 28 రోజుల వాలిడిటీని అందిస్తోంది. మీరు ఈ ప్లాన్‌తో 28 రోజుల పాటు అన్‌లిమిటెడ్ ఫ్రీ కాలింగ్‌ని ఆస్వాదించచ్చు. ఇది కాకుండా ఈ ప్లాన్‌తో కంపెనీ కస్టమర్లకు ప్రతిరోజూ 300 ఫ్రీ ఎస్‌ఎమ్‌ఎస్‌లను కూడా అందిస్తుంది.

ఈ బడ్జెట్ ప్లాన్‌లో లభించే డేటా ప్రయోజనాల గురించి మాట్లాడినట్లయితే..  ఇందులో మొత్తం 14GB డేటా లభిస్తుంది. అంటే మీరు ప్రతిరోజూ 0.5GB డేటాను మాత్రమే ఉపయోగించగలరు. మీరు సినిమా లేదా క్రికెట్ ప్రేమికులైతే ఈ ప్లాన్ మీకు బాగా నచ్చుతుంది. ఇందులో జియో టీవీ, జియో సినిమా ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా అందుబాటులో ఉంది.

రూ. 153 ప్లాన్ కాకుండా జియో తన కస్టమర్ల కోసం అనేక గొప్ప ప్లాన్‌లను కూడా అందిస్తోంది. ఇతర చౌకైన రీఛార్జ్ ప్లాన్‌ల గురించి మాట్లాడితే రూ. 75, రూ. 91, రూ. 125, రూ. 186, రూ. 223 వంటి బెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు ఉన్నాయి. మీరు ఈ రీఛార్జ్ ప్లాన్‌ని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లయితే అందుకోసం మీరు జియో ఫోన్ మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. మీరు స్మార్ట్‌ఫోన్ యూజర్ అయితే రూ.153తో పాటు ఇతర ప్లాన్‌ల ప్రయోజనాలను పొందలేరు.

Exit mobile version