Site icon Prime9

Jio Free Offer: జియో లైఫ్‌లాంగ్ ఫ్రీ ఆఫర్.. చిన్న, పెద్ద వ్యాపారులకు గుడ్ న్యూస్..!

Jio Free Offer

Jio Free Offer: జియో భారత్ ఫోన్ వినియోగదారులకు శుభవార్త. ఇక నుంచచి యూపీఐ పేమెంట్స్ సర్వీస్‌ను ఫ్రీగా అందించనుంది. జయో భారత్ ఫోన్ వినియోగదారులకు సరికొత్త ఆఫర్ ప్రకటించింది. దీని ద్వారా వ్యాపారులు రూ.1,500 వరకు సేవ్ చేయచ్చు. రిలయర్స్ జియో భారత్ ఫోన్‌లలో కొత్త, విప్లవాత్మకమైన సర్వీస్‌ను ప్రారంభించింది. ఈ ఫీచర్ చిన్న, మధ్యస్థ వ్యాపారులకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.

జియో తన జియో భారత్ ఫోన్‌లో పూర్తిగా ఉచిత జియోసౌండ్‌పే ఫీచర్‌ను ప్రారంభించింది. ఈ జియో సౌండ్ పే ఫీచర్ UPI పేమెంట్స్ నిర్ధారించడానికి ఆడియో అలర్ట్స్‌ను అందిస్తుంది. దీంతో వ్యాపారులకు అదనపు వాయిస్ బాక్స్ అవసరం ఉండదు. విశేషమేమిటంటే ఈ సర్వీస్ పూర్తిగా ఉచితం.

చిన్న వ్యాపారులు ఇప్పటివరకు సౌండ్ బాక్స్ కోసం నెలకు రూ.125 చెల్లించేవారు. జియో‌ సౌండ్ ప్లే ప్రారంభం ఈ వ్యయానికి ముగింపు పలికింది. ఇక నుంచి జియో భారత్ ఫోన్ వినియోగదారులకు సంవత్సరానికి రూ.1,500 పొదుపు చేయగలరు. ఈ ఫీచర్ వ్యాపారులకు సులభమైన, సరసమైన సర్వీస్ అందిస్తుంది. జియో సర్వీస్ నేరుగా చిన్న దుకాణ యజమానులు, కూరగాయల విక్రేతలు, చిన్న వ్యాపారాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎందుకంటే పేమెంట్స్ స్వీకరించిన వెంటనే వ్యాపారులు ఆడియో నిర్ధారణను పొందచ్చు.

జియో కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ ఇండియా దార్శనికతను మరో స్థాయికి తీసుకెళ్తున్న ప్రధాన కార్యక్రమమిది. జియో భారత్ ఫోన్‌ను ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా మార్చే విషయం ఏమిటంటే, ఇది కేవలం రూ. 699కే అత్యంత చౌక ధరలో అందుబాటులో ఉంది. కొత్త జియో సౌండ్ పే ఫీచర్ వ్యాపారులు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా తమ వ్యాపారాలను మెరుగుపరచుకోవడానికి వీలు కల్పిస్తుంది. దేశంలోని చిన్న వ్యాపారాలను డిజిటల్‌గా బలోపేతం చేయడం ఈ ఫీచర్ ప్రధాన లక్ష్యం.

రిలయన్స్ జియో ప్రెసిడెంట్ సునీల్ దత్ కొత్త జియో సౌండ్ పే ఫీచర్‌పై మాట్లాడారు. ప్రతి భారతీయుడిని సాంకేతికంగా బలోపేతం చేయడమే మా లక్ష్యం.  జియో సౌండ్ పే ఫీచర్ ద్వారా చిన్న వ్యాపారులను డిజిటల్‌గా ప్రారంభించాలనుకుంటున్నాము. ఈ చర్యతో జియో భారతదేశాన్ని డిజిటల్ సొసైటీ దిశగా ముందడుగు వేస్తోంది. చిన్న వ్యాపారవేత్త కూడా ఇక్కడ ఆధునిక సాంకేతిక సౌకర్యాలను ఉపయోగించుకోవచ్చని సునీల్ దత్ అభిప్రాయపడ్డారు.

మరో శుభవార్త జియో సౌండ్ పే ఫీచర్. ఈ ప్రత్యేక సందర్భంలో జియో వందేమాతరం ఆధునిక వెర్షన్‌ను విడుదల చేసింది. ఇది జియో సౌండ్ పేతో అనుసంధానమై ఉంటుంది. ఈ కొత్త వెర్షన్ స్వాతంత్ర పోరాట స్ఫూర్తి,సమకాలీన సంగీత స్రవంతి  సంగమం. భారతీయులందరూ దీన్ని మైజియో యాప్ లేదా జియోసావన్‌లో జియోట్యూన్‌‌గా సెటప్ చేయచ్చు.

Exit mobile version