Site icon Prime9

Itel S25 Ultra: ఐటెల్ నుంచి కొత్త ఫోన్.. ఊహించని ధరకే ఊహకందని ఫీచర్లు.. ఇలా ఎలా చేస్తారు..!

Itel S25 Ultra

Itel S25 Ultra

Itel S25 Ultra: దేశీయ టెక్ కంపెనీ ఐటెల్ త్వరలో బడ్జెట్ సెగ్మెంట్లో అధికారికంగా Itel S25 Ultra 4Gని లాంచ్ చేయబోతోంది. అయితే ఇంతకు ముందే ఫోన్  ధర, కీలక స్పెసిఫికేషన్లు, డిజైన్ ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఈ ఫోన్ మూడు కలర్ ఆప్షన్‌లలో వస్తుందని లీక్ అయిన ఫోటో చూపిస్తుంది. Itel S25 Ultra 4G వెనుకవైపు ట్రిపుల్ కెమెరా యూనిట్, డిస్‌ప్లేలో హోల్ పంచ్ కటౌట్‌ను కలిగి ఉంటుంది. ఇది 8GB వరకు ర్యామ్‌తో పాటు Unisoc T620 SoC ప్రాసెసర్‌‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.

ఓ టెక్ వీరుడు Itel S25 Ultra మార్కెటింగ్ కంటెంట్, రెండర్‌లను పోస్ట్ చేశాడు. దానిలో స్పెసిఫికేషన్‌లు, డిజైన్‌ను చూడొచ్చు. భారతదేశంలో ఈ 4G హ్యాండ్‌సెట్ ధర రూ. 15,000 కంటే తక్కువగా ఉంటుందని టిప్‌స్టర్ పేర్కొన్నారు. ఇతర మార్కెట్లలో దీని ధర దాదాపు రూ.13,500 ఉంటుంది. ఐటెల్ S25 అల్ట్రా డిజైన్ విషయానికి వస్తే బ్లాక్, బ్లూ, టైటానియం కలర్స్‌లో పంచ్ హోల్ డిస్‌ప్లే‌తో వస్తుంది. హ్యాండ్‌సెట్‌కు ఎడ్జ్‌లో ఎడమవైపు మూలలో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది. ఈ ఫోన్ వెనుక భాగం సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా లాగా ఉంటుంది.

Itel S25 Ultra Specifications
లీక్ ప్రకారం.. Itel S25 అల్ట్రా 6.78-అంగుళాల 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1,400నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ని కలిగి ఉంటుంది. ఇది 8GB RAM+ 256GB స్టోరేజ్‌తో పాటు Unisoc T620 చిప్‌సెట్‌తో రాబోతోంది. ఫోన్ 16GB వరకు RAM కలిగి ఉంటుంది. ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా ఉంటుంది. సెల్ఫీల కోసం 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండవచ్చు. Itel S25 Ultra 18W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. దీని మందం 6.9 మిమీ,  బరువు 163 గ్రాములు కావచ్చు. itel S25 Ultra IP64-రేటెడ్ బిల్డ్‌తో వస్తుంది. ఫోన్‌లో 60 నెలల ఫ్లూన్సీ సర్టిఫికేట్ కూడా అందుబాటులో ఉంది.

Exit mobile version