New Mobiles: దేశంలో రోజుకో కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదలవుతూనే ఉంది. అత్యాధ్యునిక ఫీచర్స్, సరికొత్త డిజైన్‌తో స్మార్ట్‌ఫోన్లను కంపెనీలు తీసుకొస్తూనే ఉన్నాయి. ఇక ఐటెల్ కంపెనీ తన S సిరీస్‌లో రెండు కొత్త సరసమైన స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. అందులో S25, S25 అల్ట్రా ఉన్నాయి. ఐటెల్ ఈ తాజా ఫోన్లు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ, 50MP మెయిన్ బ్యాక్ కెమెరాతో వస్తున్నాయి. ఈ క్రమంలో ఫోన్ల ధరలు, ఫీచర్లు తదితర వివరాలు తెలుసుకుందాం.
itel S25
ఐటెల్ ఎస్25 ఫీచర్ల విషచయానికి వస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల FHD+ డిస్‌ప్లే ఉంటుంది. అయితే దీనిలో అందిస్తున్న చిప్‌సెట్‌ను కంపెనీ ధృవీకరించలేదు. ఇది Unisoc T612 చిప్‌సెట్‌తో అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.
ఈ స్మార్ట్‌ఫోన్ కెమెరా సెటప్ గురించి మాట్లాడితే.. ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీన్ని పవర్ చేయడానికి కంపెనీ దీనిలో 5000mAh బ్యాటరీని అందించింది. మెరుగైన ఆడియో కోసం కంపెనీ ఈ ఫోన్‌లో DTS ఆడియో ఫీచర్‌ను కూడా తీసుకొస్తుంది.
itel S25 Ultra
ఐటెల్ అల్ట్రా మోడల్ గురించి మాట్లాడితే ఇది రెండు-టోన్ కలర్ స్కీమ్‌తో బెండెడ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. S25 అల్ట్రా అప్‌గ్రేడ్ చేసిన స్పెక్స్‌తో వస్తోంది. ఇది వెనిలా మోడల్ మాదిరిగానే డిస్‌ప్లే, రిఫ్రెష్ రేట్‌ను పొందుతుంది. అయితే ఇందులో వినియోగదారులు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7iతో ప్రొటెక్షన్ కర్వ్డ్ AMOLED ప్యానెల్‌ను కూడా చూస్తారు.
మెరుగైన పనితీరు కోసం ఇది Unisoc T620 చిప్‌సెట్‌ను పొందింది. కెమెరా సెటప్ గురించి మాట్లాడితే ఇది 32MP సెల్ఫీతో 50MP మెయిన్ వెనుక కెమెరాను కలిగి ఉంది. ఇది కాకుండా ఈ ఫోన్ భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ IP64 రేటింగ్‌తో వస్తుంది.
కంపెనీ ప్రస్తుతం ఈ సిరీస్‌ను ఫిలిప్పీన్స్‌లో అందుబాటులోకి తెచ్చింది. Itel S25 సిరీస్ ధర గురించి మాట్లాడితే దాని 8GB/128GB నిల్వ PHP 5,799 (సుమారు USD 110). S25 అల్ట్రా ప్రారంభ ధర PHP 10,999 (సుమారు USD 210). ఇక చివరగా కలర్స్ విషయానికి వస్తే S25 డెజర్ట్ గ్లామ్, బ్రోమో బ్లాక్, మంబో మింట్‌లలో అందుబాటులోకి వచ్చింది. అయితే కొమోడో ఓషన్, మెటియోర్ టైటానియం, బ్రోమో బ్లాక్ కలర్ ఆప్షన్‌లు S25 అల్ట్రాలో అందుబాటులో ఉన్నాయి.