iQOO Z9 Lite 5G Price Cut: ఇండియన్ మార్కెట్లో ఐక్యూ మొబైల్‌లకు మంచి డిమాండ్ ఉంది. సరసమైన ధరలకు కంపెనీ కొత్త ఫోన్లను విడుదల చేస్తోంది. ఇదిలా ఉంటే పాత స్మార్ట్‌ఫోన్ల ధరలను తగ్గించింది. ప్రస్తుతం “iQOO Z9 Lite 5G” ఫోన్ అమెజాన్‌లో భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఎంచుకున్న బ్యాంక్ కార్డ్‌లపై 1000 అదనపు తగ్గింపు అందిస్తుంది. ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరా, 6.56 అంగుళాల డిస్‌ప్లే ఉన్నాయి. రండి ఈ ఫోన్ ధర, ఫీచర్స్ తదితర వివరాలు తెలుసుకుందాం.
iQOO Z9 Lite 5G Offers
ఐక్యూ జెడ్9 లైట్ 5G ఫోన్ 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను కేవలం రూ. 10,499కి విడుదల చేసింది. అయితే ఇప్పుడు 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ఆప్షన్ ధర రూ.11,499గా ఉంది. ప్రస్తుతం ఈ 5G ఫోన్‌ను అమెజాన్‌లో 28శాతం తగ్గింపుతో విక్రయిస్తుంది. మీరు ఎంచుకున్న బ్యాంక్ కార్డ్‌లపై రూ.1000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. దీని ద్వారా మీరు ఈ ఫోన్‌ను రూ.9,498కి కొనుగోలు చేయచ్చు.
iQOO Z9 Lite 5G Features
ఐక్యూ జెడ్9 లైట్ 5G స్మార్ట్‌ఫోన్‌లో 6.56-అంగుళాల HD ప్లస్ LCD డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 1612 × 720 పిక్సెల్‌ల రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్, 840 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. మొబైల్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5జీ ప్రాసెసర్ ఉంది. గ్రాఫిక్స్ కోసం Mali G57 GPU అందించారు. ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారంగా Funtouch OS 14తో పని చేస్తుంది. గేమింగ్ ప్రియులు ఎలాంటి సందేహాలు లేకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్, 128జీబీ, 128జీబీ స్టోరేజ్ ఆప్షన్‌తో కూడా వస్తుంది. ఈ ఫోన్‌లో స్టోరేజ్‌ని కూడా పెంచుకోవచ్చు. ఈ ఫోన్ మైక్రో SD కార్డ్ స్లాట్‌ను సపోర్ట్ చేస్తుంది.
ఐక్యూ జెడ్9 లైట్ 5G స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ సోనీ AI (AI) కెమెరా ఉంది. దీనితో పాటు, 2 మెగాపిక్సెల్ బోకె కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం ఈ మొబైల్‌లో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ఇందులో LED ఫ్లాష్, వివిధ కెమెరా ఫీచర్లు ఉన్నాయి. మొబైల్ 5000mAh కెపాసిటీ బ్యాటరీని కలిగి ఉంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి, 15W ఛార్జింగ్ అందించారు. డస్ట్, వాటర్ నుంచి ప్రొటక్ట్ చేయడానికి స్మార్ట్‌ఫోన్‌లో IP64 రేట్ బిల్డ్ ఉంది. ఫోన్‌లో 3.5మిమీ హెడ్‌ఫోన్ జాక్, USB టైప్ C పోర్ట్‌తో సహా వివిధ ఫీచర్లు ఉన్నాయి.