Site icon Prime9

iQOO 13 Launch Date: లాంచ్ డేట్ వచ్చేసిందిగా.. ఐక్యూ 13 కొనేందుకు సిద్ధమేనా..!

iQOO 13 Launch Date

iQOO 13 Launch Date

iQOO 13 Launch Date: టెక్ కంపెనీ ఐక్యూ  భారతదేశంలో విభిన్న శ్రేణి స్మార్ట్‌ఫోన్‌లను పరిచయం చేయడానికి సిద్ధమవుతుంది. వీటిలో నంబర్ సిరీస్ మొబైల్‌లు భారతీయ కస్టమర్లను ఆకర్షించడంలో సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు కంపెనీ కొత్త iQOO 13 ఫోన్‌ను విడుదల చేయడానికి రెడీగా ఉంది. ఇది iQOO 12 ఫోన్ సక్సెసర్. ఇప్పటికే ఈ కొత్త మొబైల్ లాంచ్ తేదీని ప్రకటించారు. రాబోయే ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. కొత్త ఫోన్ ధర, ఫీచర్లను తెలుసుకుందాం.

ఐక్యూ అధికారికంగా iQOO 13 ఫోన్‌ను డిసెంబర్ 3న భారతదేశంలో లాంచ్ చేస్తుంది. ఫోన్ 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను కలిగి ఉంది. మొబైల్‌లో 16GB RAM+ 1TB స్టోరేజ్ అందుబాటులో ఉంటుంది. ఫోన్ 6.82-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అదనంగా ఇది 6150mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్‌తో సహా అనేక ఫీచర్లతో మార్కెట్లోకి ప్రవేశిస్తుంది.

iQOO 13 Specifications
ఈ మొబైల్ 6.82-అంగుళాల 2K ఫుల్ HD ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 3168 X 1440 పిక్సెల్స్ రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1440 పిక్సెల్స్ కట్‌హోల్ రిజల్యూషన్‌కు సపోర్ట్ ఇస్తుంది. దీనిలో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అందించారు.

ప్రాసెసర్ విషయానికి వస్తే ఫోన్‌లో క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ఐక్యూ 13 ఫోన్‌ను కంపెనీ విడుదల చేయనుంది. ఈ ప్రాసెసర్ 3nm ఫ్యాబ్రికేషన్స్‌పై నిర్మించారు. ఇది Android 15 ఆధారంగా OriginOS 5 OSలో పని చేస్తుంది. ఈ ఫోన్ 24GB RAM+ 1TB స్టోరేజ్ కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్‌తో 50-మెగాపిక్సెల్ Sony IMX921 కెమెరాను కలిగి ఉంది. 50-మెగాపిక్సెల్ సామ్‌సంగ్ S5KJN1 అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50-మెగాపిక్సెల్ సోనీ IMX816 టెలిఫోటో కెమెరా కూడా ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.

కంపెనీ రాబోయే iQOO 13ని 6150mAh కెపాసిటీ బ్యాటరీతో మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఫోన్‌లో 120W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ ఉంది. ఫోన్ వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం  IP69, IP68 రేటింగ్ సపోర్ట్ ఉంది. భద్రత కోసం ఇది ఇన్-డిస్ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ ఆప్షన్‌లలో 5జీ, 4జీ LTE, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, NFC, GPS, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి.

Exit mobile version