Site icon Prime9

iQOO Neo 10R: ఇదొక మరో బ్లాక్ బస్టర్.. మార్చి 11న ఐక్యూ నుంచి కొత్త ఫోన్.. ఫీచర్స్ లీక్..!

iQOO Neo 10R

iQOO Neo 10R: యువ గేమింగ్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘iQOO Neo 10R’ స్మార్ట్‌ఫోన్ మార్చి 11న దేశంలో లాంచ్ అవుతుంది. ఇప్పుడు లాంచ్‌కు ముందు కంపెనీ iQOO నియో 10R స్మార్ట్‌ఫోన్ గురించి అనేక వివరాలను పంచుకుంది. “సెగ్మెంట్‌లో అత్యంత వేగవంతమైన స్మార్ట్‌ఫోన్” అని చెబుతూ iQOO నియో 10R స్మార్ట్‌ఫోన్ లాంచ్‌కు ముందే డిస్‌ప్లే , కెమెరా, బ్యాటరీ ఫీచర్లను కంపెనీ ధృవీకరించింది.

iQOO Neo10R Features And Specifications
రాబోయే iQOO నియో 10R స్మార్ట్‌ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ 1/1.953-అంగుళాల సోనీ సెన్సార్, అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌తో జత చేసిన 8-మెగాపిక్సెల్ సెన్సార్‌తో సహా ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం, 4K 60fps (సెకనుకు ఫ్రేమ్‌లు) వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ ఇచ్చే 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది.

కంపెనీ అధికారిక మైక్రోసైట్ ప్రకారం.. ఐక్యూ నియో 10R స్మార్ట్‌ఫోన్ 4,500నిట్స్ బ్రైట్‌నెస్, 2,000Hz టచ్ స్లాపింగ్, 3,840Hz PWM డిమ్మింగ్ రేట్‌తో 1.5K డిస్‌ప్లే ఉంటుంది. ఇది 90fps గేమింగ్ అనుభవాన్ని అందిస్తుందని కంపెనీ తెలిపింది. హ్యాండ్‌సెట్ గేమింగ్ పనితీరును ఆప్టిమైజ్ చేసే డెడికేటెడ్ ఇ-స్పోర్ట్స్ మోడ్‌తో పాటు 6043మిమీ ఆవిరిపోరేటివ్ కూలింగ్ చాంబర్‌ను కలిగి ఉంటుందని కూడా ధృవీకరించారు.

అంతేకకాకుండా ఐక్యూ కొత్త ఐక్యూ నియో 10ఆర్‌లో 6,400mAh బ్యాటరీని ప్యాక్ చేసింది. ఫోన్ 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8sజెన్ 3 SoC ప్రాసెసర్ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మూన్‌నైట్ టైటానియం, ర్యాగింగ్ బ్లూ కలర్స్‌లో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.

iQOO Neo10R Price
ఐక్యూ నియో 10ఆర్‌ బెంచ్‌మార్క్‌లో 1.7 మిలియన్ పాయింట్‌లకు పైగా స్కోర్ చేసినట్లుగా చెబుతున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ. 30,000 కంటే తక్కువగా ఉంటుందని తెలుస్తుంది. స్మార్ట్‌ఫోన్ 12GB వరకు, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. అలాగే, ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల OLED స్క్రీన్‌ను పొందే అవకాశం ఉంది. అమెజాన్, ఐక్యూై ఇండియా ఇ-స్టోర్ ద్వారా సేల్‌కి వస్తుంది.

Exit mobile version
Skip to toolbar