iQOO Neo 10R Offers: మీరు కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనాలని చూస్తుంటే మీకో శుభవార్త ఉంది. స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ఐక్యూ కొంతకాలం క్రితం iQOO Neo 10R ను భారత మార్కెట్లో విడుదల చేసింది. మీరు దీని విక్రయం కోసం ఎదురుచూస్తుంటే, ఈ రోజు నుండి అంటే మార్చి 19 నుండి దీని విక్రయం ప్రారంభమైంది. గేమర్‌లను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించింది. మీరు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ నుండి ఈ తాజా ఫోన్‌ను కొనుగోలు చేయచ్చు. రోజువారీ పనితో పాటు మల్టీ-టాస్కింగ్, గేమింగ్ చేయగల స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, మీరు iQOO Neo 10R వైపు వెళ్లచ్చు. ఫస్ట్ సేల్ ఆఫర్‌లో మీరు ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌లో భారీ పొదుపులను కూడా చేయచ్చు. iQOO Neo 10R ధర నుండి ఫీచర్ల వరకు వివరంగా తెలుసుకుందాం.
iQOO Neo 10R Offers
iQOO Neo 10R మూడు స్టోరేజ్ వేరియంట్‌లలో విడుదలైంది. ఇందులో 8GB+128GB, 8GB+256GB,12GB+256GB ఎంపికలు ఉన్నాయి. 8GB + 128GB వేరియంట్ ధర రూ. 26,999. 8GB + 256GB వేరియంట్ ధర రూ. 28,999 కాగా, సిరీస్ టాప్ మోడల్, 12GB + 256GB వేరియంట్ ధర రూ. 30,999. మూన్‌నైట్ టైటానియం, ర్యాగింగ్ బ్లూ అనే రెండు కలర్ ఆప్షన్‌లతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ విడుదల చేసింది.
iQOO మొదటి సేల్ ఆఫర్‌లో కస్టమర్లకు ప్రత్యేక తగ్గింపు ఆఫర్‌ను కూడా అందిస్తోంది. HDFC బ్యాంక్, SBI బ్యాంక్ ఎంపిక చేసిన కార్డ్‌లపై మీకు రూ. 2000 వరకు తగ్గింపు ఇస్తుంది. బ్యాంక్ ఆఫర్‌లతో పాటు, కొనుగోలు సమయంలో కస్టమర్‌లకు రూ. 2000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్ ఆఫర్ కూడా అందిస్తున్నారు.
iQOO Neo 10R Specifications
iQOO Neo 10Rలో కంపెనీ 2800 x 1260 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లేను అందించింది.ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15లో రన్ అవుతుంది. దుమ్ము, ధూళి నుండి సురక్షితంగా ఉంచడానికి, కంపెనీ దీనికి IP68 రేటింగ్ ఇచ్చింది.పనితీరు కోసం స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ప్రాసెసర్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ గరిష్టంగా 12GB RAM +256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఫోటోగ్రఫీ కోసం డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది, దీనిలో 50+8 మెగాపిక్సెల్ సెన్సార్, వీడియో కాలింగ్ కోసం 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. స్మార్ట్‌ఫోన్‌లో 6400mAh బ్యాటరీని ఉంది. ఈ బ్యాటరీ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది.