Site icon Prime9

iQOO Neo 10 Series: ఐక్యూ నుంచి సూపర్ ఫోన్లు.. దిమ్మతిరిగే ఫీచర్స్.. ఈ నెలలోనే లాంచ్..!

iQOO Neo 10 Series

iQOO Neo 10 Series

iQOO Neo 10 Series: ఐక్యూ సంస్థ మంచి జోరు మీద ఉందనే చెప్పాలి. వరుసగా అన్ని సెగ్మెంట్‌లలో మొబైల్స్‌ను తీసుకొస్తుంది. అయితే ఇప్పుడు కంపెనీ కొత్త సరీస్ నియో 10ను ప్రారంభిస్తున్నట్లు ధృవీకరించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రాసెసర్, పనితీరు పరంగా ప్రత్యేకంగా నిలుస్తుంది. నవంబర్ 29న చైనాలో జరిగే ఓ ఈవెంట్‌లో Neo 10,  Neo 10 Proలను కంపెనీ పరిచయం చేస్తుందని ధృవీకరించింది. ఈ రెండు ఫోన్లు కూడా గీక్‌బెంచ్‌లో కనిపించాయి.

iQOO Neo 10 Series Launch Date
iQOO Neo 10 సిరీస్ చైనాలో నవంబర్ 29న స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటలకు, భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సిరీస్ ప్రీ-ఆర్డర్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఫోన్‌ను ప్రీ-ఆర్డర్ చేసిన కస్టమర్‌లకు బ్లూటూత్ స్పీకర్, మూడేళ్ల బ్యాటరీ వారంటీ, కస్టమైజ్డ్ టెంపర్డ్ ఫిల్మ్, ట్రేడ్-ఇన్ బోనస్ వంటి అనేక బహుమతులు లభిస్తాయి.

iQOO Neo 10 Series Specifications
iQOO Neo ప్రొడక్ట్ మేనేజర్ Neo_Beta ఇటీవల రెండు ఫోన్‌లు ప్రత్యేకమైన ఫుల్-బ్రైట్‌నెస్ హై-ఫ్రీక్వెన్సీ డిమ్మింగ్‌తో 8T LTPO స్క్రీన్‌ను ఉపయోగిస్తాయని వెల్లడించింది. ఈ ఫోన్ Android 15 ఆపరేటింగ్ సిస్టమ్, 16GB RAMతో వస్తుంది. ఐక్యూ నియో 10 ప్రో MediaTek Dimensity 9400 SoC ప్రాసెసర్‌తో వస్తుంది.  గేమింగ్ చిప్ Q2ని ఉపయోగిస్తుంది. ఐక్యూ నియో 10 స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 SoC ప్రాసెసర్‌తో వస్తుందని భావిస్తున్నారు.

ఫోన్ గ్రే, ఆరెంజ్ డ్యూయల్ టోన్ కలర్‌లో కనిపిస్తుంది. మొబైల్ టీజర్‌ని చూస్తే ఇది సన్నని బెజెల్స్‌తో ఫ్లాట్ డిస్‌ప్లే, ముందు భాగంలో పంచ్-హోల్ కటౌట్‌ను చూపుతుంది. ఇది కాకుండా Weiboలో పోస్ట్‌లో కనిపించే ఇతర టీజర్ ఫోటోలు iQOO నియో 10 సిరీస్ షాడో బ్లాక్, ర్యాలీ ఆరెంజ్, చి గువాంగ్ వైట్ కలర్స్‌లో అందుబాటులో ఉంటుందని వెల్లడిస్తున్నాయి. ఫోన్బ్యాటరీ సుమారు 6100mAh ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలానే ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో వస్తుందని మునుపటి నివేదికలు వెల్లడించాయి. ఫోన్‌లు అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌కు మద్దతు ఇస్తాయి.

Exit mobile version