Site icon Prime9

iQOO Neo 10 Series Launch: అదిరిపోయింది భయ్యా.. ఐక్యూ నుంచి రెండు కిల్లర్ ఫోన్లు.. కెమెనా తోపు..!

iQOO Neo 10 Series Launch

iQOO Neo 10 Series Launch

iQOO Neo 10 Series Launch: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు బ్రాండ్ iQOO, మీడియాటెక్ డైమెన్షన్ 9400 ప్రాసెసర్‌తో రాబోయే iQOO Neo 10 Series స్మార్ట్‌ఫోన్ 29 నవంబర్ 2024న  భారతదేశంలో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ కూడా ధృవీకరించింది. అలానే ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయడానికి ముందు, దాని డిజైనింగ్, హైలైట్ ఫీచర్ల గురించి కొంత సమాచారం ట్విట్టర్ ద్వారా లీక్ అయింది.

చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO ఈ సిరీస్‌లో మొత్తం రెండు స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకొస్తుంది. అందులో iQOO Neo 10, iQOO Neo 10 Pro ఉన్నాయి. ఇవి 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల డిస్‌ప్లేని కలిగి ఉంటాయి. 50MP ప్రైమరీ కెమెరా ఉంటుంది. అయితే స్మార్ట్‌ఫోన్ సేల్ గురించి ప్రస్తుతం ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు. కానీ ఆసక్తికర విషయం ఏమిటంటే రాబోయే స్మార్ట్‌ఫోన్లు గీక్‌బెంచ్ సైట్‌లో లిస్ట్ అయ్యాయి.  దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఈ రాబోయే iQOO నియో 10 సిరీస్ స్మార్ట్‌ఫోన్ చైనాలో 29 నవంబర్ 2024న విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. అలానే ఈ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం ప్రీ-బుకింగ్ ప్రారంభమైంది. ప్రీ-బుకింగ్ కస్టమర్లకు ఉచితంగా బ్లూటూత్ స్పీకర్, మూడేళ్ల బ్యాటరీ వారంటీ, కస్టమ్ టెంపర్డ్ ఫిల్మ్‌తో పాటు ట్రేడ్-ఇన్ బోనస్ వంటి అనేక ప్రత్యేక ఆఫర్‌లను అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.

iQOO Neo 10 Series Specificatons
iQOO Neo 10 Pro స్మార్ట్‌ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల 1.5K 8T LTPO AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. iQOO Neo 10 Pro స్మార్ట్‌ఫోన్ f/1.56 ఎపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, అల్ట్రా-వైడ్ లెన్స్‌తో కూడిన సెకండరీ 50MP కెమెరాను కలిగి ఉంటుందని లీక్స్ సూచిస్తున్నాయి. అలాగే దీని ఫ్రంట్ కెమెరా గురించిన వివరాలు ఇంకా వెల్లడించలేదు.

ఈ స్మార్ట్‌ఫోన్ సరికొత్త MediaTek Dimensity 9400 ప్రాసెసర్‌తో పనిచేసే అవకాశం ఉంది. 16జీబీ ర్యామ్, 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. iQOO నియో 10 ప్రో స్మార్ట్‌ఫోన్ 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో భారీ 6,000mAh బ్యాటరీని కూడా ప్యాక్ చేస్తుందని భావిస్తున్నారు. ఇది దాని ముందు ఉపయోగించిన ఆప్టికల్ సెన్సార్‌తో పాటు అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో కూడిన ప్లాస్టిక్ ఫ్రేమ్‌ను కలిగి ఉంది.

Exit mobile version