Site icon Prime9

iQOO Z10 Turbo Leaks: మార్కెట్లో యుద్ధమే.. 7,600mAh బ్యాటరీతో ఐక్యూ నుంచి కొత్త ఫోన్.. ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే..?

iQOO Z10 Turbo Leaks

iQOO Z10 Turbo Leaks

iQOO Z10 Turbo Leaks: స్మార్ట్‌ఫోన్ మేకర్ వివో సబ్ బ్రాండ్ ఐక్యూ ఇటీవల ‘iQOO Neo 10R’ ఇటీవల భారతదేశంలో ప్రారంభించింది. రూ.26,999 ప్రారంభ ధరతో పరిచయం చేసింది. ఇప్పుడు, రెండు కొత్త ఫోన్‌లను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. అవును, కంపెనీ తన కొత్త స్మార్ట్‌ఫోన్‌లు iQOO Z10, iQOO Z10 Turboలను వచ్చే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. మరి ఈ స్మార్ట్‌ఫోన్‌ల ఫీచర్లు ఏంటో తెలుసుకుందాం.

ఇంటర్నెట్‌‌‌లో తాజాగా ఫోన్ డిస్‌ప్లే, కెమెరా, ప్రాసెసర్, బ్యాటరీ, ఛార్జింగ్‌కు సంబంధించిన ముఖ్యమైన ఫీచర్లు లీక్ అయ్యాయి. దీని ప్రకారం, స్టాండర్డ్ మోడల్‌లో డైమెన్సిటీ 8400 ప్రాసెసర్ ఉంటుంది. అలాగే టర్బో వేరియంట్ శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8s ఎలైట్ ప్రాసెసర్‌తో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది. ఈ మొబైల్‌లో 6.78 అంగుళాల డిస్‌ప్లే ఉంది.

iQOO Z10 Turbo Features
నివేదికల ప్రకారం ఈ టర్బో మొబైల్‌లో ఇన్-స్క్రీన్ షార్ట్ ఫోకస్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ ఉంటుంది. ఇది భద్రత, సౌలభ్యం రెండింటినీ పెంచుతుంది. అంతేకాదు ఈ ఫోన్ ఫ్రేమ్ ప్లాస్టిక్‌తో తయారు చేశారు. అలాగే ఈ మొబైల్ తేలికగా ఉంటుందని భావిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌లో 6.78-అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఇది ఫ్లాట్ OLED LTPS ప్యానెల్‌పై చేసిన డిస్‌ప్లే. 1.5K రిజల్యూషన్‌కు సపోర్ట్ ఇస్తుంది.

ఈ హై రిజల్యూషన్ డిస్‌ప్లే మెరుగైన విజువల్ అనుభూతిని అందిస్తుంది. మొబైల్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8400 ప్రాసెసర్ ఉండే అవకాశం ఉంది. ఇది అద్భుతమైన పనితీరు, మృదువైన మల్టీ టాస్కింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ ప్రాసెసర్ గేమింగ్, హై పెర్ఫార్మెన్స్ టాస్క్‌లను బాగా హ్యాండిల్ చేసేలా రూపొందించారు. ఇందులో ఆండ్రాయిడ్ 15 ఓఎస్ ఉంటుంది.

మొబైల్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అందుబాటులో ఉంది. దీనితో పాటు, 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాను కలిగి ఉన్న సంగతి తెలిసిందే. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం, 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా చేర్చారు. మీరు ఈ ఫోన్‌లో అద్భుతమైన ఫోటోలు,వీడియో రికార్డింగ్‌లను తీసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ 7,600mAh కెపాసిటీ గల పెద్ద బ్యాటరీతో విడుదల కానుంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి, 90W ఫాస్ట్ ఛార్జింగ్ అందించారు. ఈ బ్యాటరీ లాంగ్ బ్యాకప్, ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాన్ని అందిస్తుంది.

Exit mobile version
Skip to toolbar