Site icon Prime9

iQOO Neo 10 Series: ఐక్యూకి తిరుగులేదు.. త్వరలో నియో పవర్‌ఫుల్ ఫోన్..!

iQOO Neo 10 Series

iQOO Neo 10 Series

iQOO Neo 10 Series: వివో సబ్-బ్రాండ్ iQOO తన నియో సిరీస్ క్రింద కొత్త నియో 10 సిరీస్ ఫోన్‌లను త్వరలో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. నియో 9 సక్సెసర్‌గా ఈ సిరీస్ రాబోతోంది. iQOO నియో 10 సిరీస్ కింద కంపెనీ iQOO నియో 10, iQOO నియో 10 ప్రోతో సహా రెండు కొత్త ఫోన్‌లను విడుదల చేయబోతోంది. ఇప్పుడు iQOO చైనాలో iQOO నియో 10 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయడం ప్రారంభించింది. బ్రాండ్ తన డిజైన్‌ను ధృవీకరించడానికి ఫోటోలను కూడా షేర్ చేసింది.

iQOO Neo 10 Series
iQOO నియో 10 సిరీస్ ఆరెంజ్-గ్రే డ్యూయల్-టోన్ ముగింపుతో రాబోతోంది. కొత్త సిరీస్ గత సంవత్సరం నియో 9 సిరీస్‌ని స్పష్టంగా పోలి ఉంటుంది. Vivo ఆన్‌లైన్ స్టోర్, JD, Tmall, Pinduoduo వంటి బహుళ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా Neo 10 లైనప్ ఇప్పుడు చైనాలో ప్రీ-రిజర్వ్ చేయడానికి అందుబాటులో ఉంది.

చైనీస్ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ Weiboలో iQOO నియో 10 సిరీస్ డిస్‌ప్లే వివరాలు, డిజైన్‌ను వెల్లడించింది. పోస్ట్ ప్రకారం రాబోయే ఫోన్ సెల్ఫీ షూటర్ కోసం పంచ్-హోల్ కటౌట్‌తో 6.78-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. డిస్ప్లే సన్నని బెజెల్‌లను కలిగి ఉంది.

iQOO నియో 10 సిరీస్‌లో యాంటీ గ్లేర్ గ్లాస్ బ్యాక్ ఉందని టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ వెల్లడించింది. ఇంతకుముందు టిప్‌స్టర్ నియో 10 సిరీస్‌లో ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉందని పేర్కొన్నారు. ఇది బ్రష్డ్ మెటల్ ఫినిషింగ్ కలిగి ఉంది. అన్ని నియో 10 సిరీస్ మోడల్స్ 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,100mAh బ్యాటరీని ప్యాక్ చేస్తాయి. నియో 10 సిరీస్ ప్రాసెసర్, గ్రాఫిక్స్ కోసం ప్రత్యేక చిప్‌తో డ్యూయల్-చిప్ సెటప్‌ను కలిగి ఉంటుంది.

నివేదికల ప్రకారం.. iQOO Neo 10 స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. నియో 10 ప్రో మరోవైపు  డైమెన్సిటీ 9400 SoCని కలిగి ఉంటుంది. నియో 10 ప్రో 50 మెగాపిక్సెల్ సోనీ IMX921 ప్రైమరీ కెమెరాతో OIS ససోర్ట్‌తో  50 మెగాపిక్సెల్ Samsung ZN1 అల్ట్రా-వైడ్ లెన్స్‌ను కలిగి ఉంటుంది. నియో 10 50-మెగాపిక్సెల్ + 8-మెగాపిక్సెల్ డ్యూయల్ డ్యూయల్‌ను కలిగి ఉంటుందని మరొక లీకర్ వెల్లడించారు. ఈ ఫోన్ లాంచ్ గురించి మాట్లాడితే.. ఈ నెలాఖరులోగా నియో 10 సిరీస్ లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.

Exit mobile version