Site icon Prime9

iPhone 17 Air: అర్రే జారిపోయేలా ఉన్నాయే.. ఆపిల్, సామ్‌సంగ్ నుంచి సన్నని ఫోన్లు.. సైజ్ తెలిస్తే షాకవుతారు..!

iPhone 17 Air

iPhone 17 Air: గ్లోబల్ టెక్ మార్కెట్‌లో ఆపిల్, సామ్‌సంగ్ బ్రాండ్లకు ఉన్న క్రేజ్ వేరే లెవల్ అనే చెప్పాలి. ఈ కంపెనీల నుంచి ఏదైనా ప్రొడక్ట్ వస్తుందంటే ఫుల్ హైప్ ఉంటుంది. వీటి గురించి చర్చ కూడా ఆ రేంజ్‌లోనే జరుగుతుంటుంది. ఈ నేపథ్యంలోనే ఐఫోన్ 17 ఎయిర్, సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 25 స్లిమ్ స్మార్ట్‌ఫోన్ల ప్రత్యేక స్పెసిఫికేషన్‌లు ప్రతిరోజూ వస్తున్న లీక్డ్ రిపోర్ట్‌లలో వెల్లడవుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఆపిల్,  సామ్‌సంగ్ ఈ రెండు రాబోయే స్మార్ట్‌ఫోన్‌ల గురించి అధికారిక వివరాలను విడుదల చేయలేదు.

అయితే, బ్యాటరీ, చిప్‌సెట్,  డిజైన్‌కు సంబంధించిన అనేక సమాచారం మీడియా నివేదికలలో బయటకు వస్తోంది. ఇంటర్నెట్‌లోని సమాచారం ప్రకారం.. ఆపిల్ iPhone 17 Air, Samsung Galaxy S25 Slim  Ultra స్లిమ్ డిజైన్‌తో వస్తాయి. ఫోన్‌ల బ్యాటరీ వివరాలు తాజా నివేదికలో వెల్లడయ్యాయి, ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు 2025లో అతిచిన్న బ్యాటరీ ప్యాక్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌లుగా నిలుస్తాయని తెలుస్తోంది.

ఆపిల్ iPhone 17 Air స్మార్ట్‌ఫోన్‌లో 3000mAh నుండి 4000mAh వరకు బ్యాటరీ ఉండవచ్చని ఓ టెక్కీ వెల్లడించారు. ఇది ప్రస్తుత iPhone మోడల్‌లలో ఉన్న బ్యాటరీ ప్యాక్‌ని పోలి ఉంటుంది. iPhone 16 3561mah బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ మందం 7.8 మిమీ. ఐఫోన్ 17 ఎయిర్ చాలా సన్నగా ఉంటుంది. DCS ప్రకారం ఫోన్ మందం 5.xmm నుండి 6.xmm మధ్య ఉంటుంది. ఇది సన్నగా ఉండటం వల్ల, బ్యాటరీ ప్యాక్‌తో కంపెనీ ఎక్కడో రాజీ పడవలసి వస్తుంది. అయితే  iPhone 16 మందం, బ్యాటరీ ప్యాక్‌ను చూస్తే రాబోయే iPhone చాలా మెరుగ్గా కనిపిస్తుంది. అయితే, ఇది ఇతర కంపెనీల స్మార్ట్‌ఫోన్‌ల కంటే చాలా తక్కువగా ఉంటుంది.

ఐఫోన్ 17 ఎయిర్ మాత్రమే కాకుండా Samsung Galaxy S25 Slim కూడా అల్ట్రా స్లిమ్ డిజైన్‌తో రానుంది. మునుపటి నివేదికల ప్రకారం.. ఇది 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. గెలాక్సీ ఎస్‌25 స్లిమ్ 3000-4000mAh బ్యాటరీ ప్యాక్‌తో కూడా రావచ్చని DCS నివేదిక పేర్కొంది. ఇంత సన్నని ఫ్రేమ్‌లో పెద్ద బ్యాటరీలను అమర్చడం అంత సులభం కాదు. అధిక సాంద్రత కలిగిన సిలికాన్-కార్బన్ (Si/C) బ్యాటరీ టెక్నాలజీ దీనికి సహాయపడుతుంది. అయితే, ప్రస్తుతం యాపిల్ లేదా సామ్‌సంగ్ దీనిని ధృవీకరించలేదు.

Exit mobile version